Jagan – Nara Lokesh : జగన్ కంచుకోట లో అడుగు పెట్టిన నారా లోకేష్ – వస్తూనే బిగ్ బ్యాడ్ న్యూస్ !
Jagan – Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు కడప జిల్లాలోకి ప్రవేశం కానుంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో శుద్ధపల్లిలో లోకేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ జిల్లాలో దాదాపు 40 రోజులపాటు 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. నేడు కడప జిల్లాలోకి లోకేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు.
ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం భావిస్తున్నారు. ఒకప్పుడు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గుండ్లకుంట శివారెడ్డి హయాంలో జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది. ఆయన హత్య అనంతరం వారసుడిగా రామ సుబ్బారెడ్డి వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
ఆదినారాయణ రెడ్డి రాకను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే కడప జిల్లాలో మొట్టమొదటి రోజు లోకేష్ పాదయాత్రలో ఆ పార్టీకి బిగ్ బ్యాడ్ న్యూస్ అని ప్రచారం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు వైసీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్. కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పట్టించుకోని నేపథ్యంలో ఈ రీతిగా లోకేష్ కి షాక్ ఇవ్వడానికి అసంతృప్తి నేతలు ప్లాన్ చేసినట్లు సమాచారం