KCR : తెలంగాణకు మోడీ సర్కార్ డెడ్‌లైన్.. కేసీఆర్ తగ్గుతాడా.. పంతం నెగ్గుతాడా?
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విషయంలోనూ కేంద్రంతో కాలుదువ్వుతున్నాడు. కేంద్రం ఒక్కటంటే.. కేసీఆర్ రెండంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న తప్పులను ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రెస్ మీట్లు,సభల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు. కానీ ఆయన మాటలు నమ్మేందుకు జనం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. కారణం గత రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడమే. ఇటీవల కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా చండూరు, నిన్న పెద్దపల్లిలో భారీ సభ నిర్వహించి కేంద్రాన్ని విమర్శించారు.జాతీయ రాజకీయాల్లోకి పోవాలా? వద్దా? అని ప్రజలను కోరారు.
KCR : కేసీఆర్ తగ్గకపోతే ఏం జరుగుతుంది.
కేసీఆర్ ప్రతి మూమెంట్‌ను గమనిస్తున్న కేంద్రం.. ఆయన్ను ఎలా కట్టడి చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవడం లేదని తెలుస్తోంది.మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రకటించడం.. ఫినిక్స్, వాసవి కంపెనీలపై ఈడీ దాడులు.. తాజాగా ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఒక నెలలోపు చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది.దీంతో కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టాలని కేంద్రం భావించినట్టు సమాచారం. 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. రూ. 3,441కోట్లుకు సర్ చార్జీలు కలిపి రూ. 3,315 కోట్లు అనగా.. మెత్తంగా రూ.6,766 కోట్లను చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
గతంలో చంద్రబాబు హయాం నుంచి నేడు సీఎం జగన్ ఈ బకాయిల విషయంలో కేంద్రానికి పలుమార్లు విన్నవించుకున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో జగన్ ఈ ప్రస్తావన తేవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు ఒకనెలలో చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది నిజంగానే కేసీఆర్‌కు గట్టి దెబ్బనే చెప్పవచ్చును. అయితే, ఈ విషయంలో కేసీఆర్ కేంద్రానికి తలొగ్గుతారా? లేదా తన పంతం నెగ్గించుకోవడానికి కోర్టుకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ మళ్లీ కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళితే.. మోడీ సర్కార్ ఈ సారి ఎటువంటి పాయింట్ ఎత్తుకుని కేసీఆర్ సర్కార్‌కు స్కెచ్ గీస్తుందో తెలియాల్సి ఉంది.