Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్ సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్‌రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు.
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో బుక్‌చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్‌రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం పంపిణీ చేసినట్లు మెసేజ్ పంపించారు.
దాంతో బాధితుడు అన్ని ఆధారాలతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం బాధితుడికి నష్ట పరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పును వెలువరించింది. సకాలంలో చెల్లించకపోతే నష్ట పరిహారానికి 12 శాతం వడ్డీ కట్టాలని ఆదేశించింది.