Ram Charan : జాతీయ జెండాను అవమానించిన రామ్ చరణ్? భగ్గుమంటున్న నెటిజన్లు?
Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను రామ్ చరణ్ అవమానించారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏమైంది? అసలు.. జాతీయ జెండాను రామ్ చరణ్ ఎందుకు అవమానిస్తారు? అని అంటారా.. అసలు విషయం ఏంటంటే.. రామ్ చరణ్ కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే కదా.

netizens comments on ram charan over insulting national flag
హ్యాపీ అనే మొబైల్ బ్రాండ్ కు కూడా అంబాసిడర్ గా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు. భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హ్యాపీ మొబైల్స్.. ఓ న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఆ యాడ్ లో రామ్ చరణ్.. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని.. భారత జాతీయ జెండాను పట్టుకొని నిలబడతారు. అయితే.. ఆ జాతీయ జెండా మధ్యలో అశోక చక్ర ఉండదు. ఆశోక ధర్మచక్రం లేకుండా.. జాతీయ జెండాను అలా ఎలా ఎగురవేస్తారంటూ.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

netizens comments on ram charan over insulting national flag
Ram Charan : జెండా మధ్యలో అశోక చక్రం లేకుండా ఎందుకు యాడ్ ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇచ్చిన సంస్థ
జాతీయ జెండాను అవమానించడం మా ఉద్దేశం కాదు. వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడుకోకూడదు. అలా చేస్తే అది నేరం. అందుకే.. జాతీయ జెండాను పోలిన త్రివర్ణ పతాకాన్ని మేం వాడుకున్నాం. అందుకే.. మధ్యలో అశోక ధర్మచక్రం లేదు.. ఇది జాతీయ జెండా కాదు.. అని హ్యాపీ సంస్థ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కాస్త శాంతించారు. అలా అయితే ఓకే.. అని కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/always2_suhel/status/1424629771732979712?s=20
మొత్తానికి ఆ వ్యవహరం సద్దుమణిగిపోయింది. ఇక.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారు. అది పాన్ ఇండియా మూవీ. ఆ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ.. రామ్ చరణ్.. ఒక అతిథి పాత్రలో కనిపించనున్నారు.
They are not supposed to use National flag for Advertisements. That's why they are just showing only 3 colours.
— .. (@vinodfriend1) August 14, 2021