AP New Liquor Policy : తాగుబోతులకు కిక్ ఇచ్చే న్యూస్.. ఏపీలో బాబు మార్క్ మొదలు..!
ప్రధానాంశాలు:
AP New Liquor Policy : తాగుబోతులకు కిక్ ఇచ్చే న్యూస్.. ఏపీలో బాబు మార్క్ మొదలు..!
AP New Liquor Policy : గత ఐదేళ్లు వైసీపీ పరిపాలన ఎలా ఉన్నా మందుబాబులకు వాళ్లకు కావాల్సిన బ్రాండ్ లు కాకుండా సొంత బ్రాండ్ లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారన్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని కొత్త బ్రాండులు, చీప్ బ్రాండ్ లతో గత ప్రభుత్వం నడిపించిన తీరు ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ప్రభుత్వమే మందు అమ్మడం అనేది కాన్సెప్ట్ బాగున్నా అక్కడ దొరికే సరుకు మాత్రం లోకల్ ది అవ్వడం వల్ల ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నారు. ఐతే ఏపీలో మారిన ప్రభుత్వం ఇక మీదట అన్ని బ్రాండ్ లను అందుబాటులో తెచ్చేలా చూస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీ ప్రజలకు దూరమైన ఎన్నో బ్రాండ్ లు రాగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబు దేశంలో టాప్ లిక్కర్ బ్రాండ్స్ అన్ని ఏపీకి వచ్చేలా. ఏపీలో అందుబాటులో ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. కొత్త లిక్కర్ పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్న ప్రభువం ఈ పాలసీతో దేశంలోనే అత్యుత్తంగా ఉండేలా చేస్తున్నారట.
AP New Liquor Policy మద్యం అక్రమ రవాణా తగ్గించేలా..
కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం అక్రమ రవాణా తగ్గించడంతో పాటుగా వీలుంటుందని అంటున్నారు. అంతేకాదు క్రైం కంట్రోల్ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసేలా అధికారులతో చర్చించారు చంద్రబాబు. ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వస్తే మాత్రం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేలా పరిపాలన ఉంటుందని అంటున్నారు.
ఇక ఏపీలో దొరకని బ్రాండ్ అంటూ ఉండదు అనిపించుకునేలా దేశం లో దొరికే అన్ని టాప్ బ్రాండ్ లిక్కర్ లను ఏపీకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తానికి బాబు మార్క్ పాలన అన్ని విషయాల్లోనూ అన్నట్టుగా లిక్కర్ పాలసీ లో కూడా కొత్త ప్రాతిపదికతో వస్తున్నారు. తప్పకుండా ఇది మందు బాబులకు శుభవార్త అని చెప్పొచ్చు. మొన్నటిదాకా ఏపీలో లోకల్ సరుకుతో నానా తిప్పలు పడిన మందుబాబులు ఇక మీదట ఫైన్ బ్రాండ్ లతో మరింత కిక్ పొందే అవకాశం ఉంటుంది.