AP New Liquor Policy : ఏపీలో మద్యం కొరత.. మందుబాబులు ఈ విషయం తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
AP New Liquor Policy : ఏపీలో మద్యం కొరత.. మందుబాబులు ఈ విషయం తెలుసుకోండి..!
AP New Liquor Policy : ఏపీలో అనూహ్యంగా మద్యం కొరత ఏర్పడింది. వైన్ షాపుల్లో మద్యం నిల్వలు ఎక్కడికక్కడ స్టాక్ లేకుండా ఉన్నాయి. ఐతే దీనికి కారణం ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ చేస్తున్న టైం కాబట్టి అని అనుకుంటున్నారు. డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరాను నిలిపివెశారు. దీని వల్ల మందుబాబులందరికీ కొరత మొదలైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో మద్యం లేక షాపులు వెలవెలబోతున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెస్తున్న కారణంగా అన్ని ప్రముఖ బ్రాండ్లు తీసుకొస్తున్నారు. ఐతే ప్రస్తుతం మాత్రం మద్యం దొరకడం కష్టంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖరీదైన బ్రాండ్ లను తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దాని వల్ల మందుబాబులకు అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. ఐతే రెండు రోజులుగా ఇదే పరిస్తితి ఉందని మద్యం దుకాణాల నిర్వాహకులు అంటున్నారు.
AP New Liquor Policy రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ..
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ సాహ్పులు తీసుకురావాలని నిర్ణయించింది. అక్టోబర్ లో ఈ పాలసీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ఉన్న స్టాక్ అంతా అమ్మాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్టాక్ లేదని సిబ్బంది ఎంత చెప్పినా సరే అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాని వల్ల వాటిని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో మద్యం దొరక్కపోవడంతో బార్ లకు వెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కువ రేటుకి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త మద్య పాలసీ వచ్చే వరకు మందుబాబులకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తుంది. కొత్త మద్యం పాలసీ వస్తే ఇదివరకులా ప్రైవేట్ వ్యక్తులే షాపులను నడిపించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు మంచి బ్రాండ్ లను మద్యం ప్రియులకు అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు. ఐతే ఏపీలో కొత్త మద్యం పాలసీ తో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఐతే ప్రభుత్వం మద్యం షాపులు నడిపించడం కన్నా ఇది బెటరే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.