Home » Exclusive » New Zealand Woman Riding A Bicycle And Giving Birth To A Baby
Exclusive

Viral News : డెలివరీ టైం.. సైకిల్ తొక్కుతూ వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వైరల్ న్యూస్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: November 29, 2021 7:59 am
Advertisement

Viral News : సాధారణంగా కొందరు ఆడవాళ్లు ప్రతి చిన్నదానికే భయపడుతుంటారు. మరికొందరు మాత్రం అన్నింటికీ ఎదురు వెళ్తుంటారు. ఏదైతే అవుతుంది అనుకునేవారే జీవితంలో విజయాలను సాధిస్తుంటారు. ఎప్పుడూ భయపడుతూ, ప్రతీ చిన్నవిషయానకి అనుమానం, ఆందోళన, భయం భయంగా గడిపేవారు నిజజీవితంలో వెనుకబడే ఉంటారు. ఏమీ సాధించలేకపోవచ్చు. పొందిన దాంతోనే సంతృప్తి పడుతుంటారు. ఇలాంటి వారితో ఉంటే మిగతా వాళ్లు కూడా తమ జీవితంలో వెనకబడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఓ మహిళ నిండు గర్భిణీ. పైగా డెలివరీ టైం దగ్గర పడింది. ఇంట్లో ఎవరు లేని టైంలో తానే సొంతంగా సైకిల్ తొక్కుతూ హాస్పిటల్ వెళ్లి బిడ్డకు జన్మినిచ్చింది.

Advertisement

వినడానికే షాకింగ్‌గా ఉంది కదూ.. కానీ జరిగింది మాత్రం వాస్తవం.. ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు ఎప్పుడైనా తోడు అవసరం.. నెలలు నిండాక వారి పక్కన తప్పనిసరిగా ఎవరో ఒకరు తోడుండాలి. వాష్ రూం వెళ్లాలన్న భర్త లేదా అత్తింటి లేదా అమ్మవారి తరపు వారి సాయం అవసరం. ఒకవేళ సొంతంగా పనులు చేసుకునే టైంలో కాలి జారి పడిపోవడం, బరువులు మోయడం లాంటివి చేస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఈ భయంతోనే చాలా మంది ఆడవాళ్లు బెడ్ లో నుంచి కిందకు దిగరు. ఫలితంగా కొందరు బరువు పెరుగుతారు.

Advertisement

New Zealand woman riding a bicycle and giving birth to a baby

Viral News : భ‌యంతో బెడ్ దిగ‌ని మ‌హిళ‌లు..

కానీ, నెలలు నిండాక కూడా వాకింగ్ చేస్తే, చిన్న చిన్న పనులు చేస్తే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని మరికొందరు చెబుతుంటారు. రెండో దానిని బలంగా నమ్మినట్టు ఉంది ఈ మహిళ. డెలివరీ కోసం వాహనాల్లో వెళ్లకుండా ఏకంగా సైకిల్ రైడ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్లి ఏకంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూజీలాండ్ దేశంలో చోటుచేసుకోగా.. ఈ ఫీట్ ‘జూలీ అన్నే జెంటర్’ అనే మహిళ సాధించి రికార్డు సృష్టించింది. ఇంకొక విషయం.. ఈమె సాధారణ మహిళ కాదు. న్యూజీలాండ్ పార్లమెంట్ మెంబర్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి