Nimmagadda : మరో కొత్త ఏకపక్ష నిర్ణయం.. పాపం జగన్‌ను మరీ ఇంతగా నిమ్మగడ్డ ఎందుకు వేదిస్తున్నాడు
Nimmagadda : ఏపీలో పంచాయితీ ఎన్నికలను తాను అనుకున్నట్లుగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇతర దశల్లో కూడా పంచాయితీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో నిమ్మగడ్డ మరో ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రభుత్వంపై పెద్ద బండ వేసే ప్రయత్నం చేస్తున్నాడట. నిమ్మగడ్డ ఆధ్వర్యంలో అసలు పంచాయితీ ఎన్నికలకు వెళ్లడమే ఇష్టం లేని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక కారణాలు చెప్పి వాయిదా వేయించే ప్రయత్నం చేశారు అనేది టాక్. కాని సుప్రీం కోర్టు నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇక చేసేది లేక జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Nimmagadda : మున్సిపల్ ఎన్నికల హడావుడి..
మరి కొన్ని వారాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు. ఈ లోపు పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని కోరుకున్న నిమ్మగడ్డ రమేష్ అనుకున్నది చేశాడు. ఇప్పుడు జగన్ ను మరింతగా ఇరుకున పెట్టే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా నిర్ణయం తీసుకోబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడో రేపో నిమ్మగడ్డ రమేష్ తాను అనుకున్నట్లుగానే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. కొత్త ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో జగన్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు. కాని నిమ్మగడ్డ మాత్రం పంతంతో తానే నిర్వహిస్తానని అంటున్నాడట.
టీడీపీ వెనుక ఉండి నడిపిస్తుంది..
వైకాపా నాయకులు మొదటి నుండి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక టీడీపీ ఉందని, చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ కు తగ్గట్లుగానే ఆయన నడుచుకుంటున్నాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా తెలుగు దేశం పార్టీ ఆయన్ను వెనుక నుండి ఒత్తిడి చేసి నోటిఫికేషన్ విడుదల చేయించే ప్రయత్నం చేస్తుంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ నాయకులకు నిమ్మగడ్డ పూర్తిగా సహకరిస్తున్నాడు అంటున్నారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు ఇష్టం లేకుండా వెళ్లిన వైకాపా మున్సిపల్ ఎన్నికలు అంటే ఖచ్చితంగా మరింతగా ప్రతిఘటించేందుకు అవకాశం ఉంది. మరి నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఏమేరకు వర్కౌట్ అవుతుంది, దాన్ని జగన్ ఎలా అడ్డుకోగలడు అనే విషయాలు మరి కొన్ని రోజులు ఆగితే కాని తెలియవు.