Nominations : మొదలైన అయిన నామినేషన్ల పర్వం.. పూర్తి వివరాలు మీ కోసం..!
Nominations : ఎప్పుడెప్పుడడా అని పార్టీలు ఎదురు చూస్తున్న పర్వం రానే వచ్చింది. ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి స్టార్ట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంటే.. ఇటు ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పర్వం కూడా నడుస్తోంది. దాంతో అభ్యర్థులు అందరూ నామినేషన్లేయడానికి అన్ని రకాల పనులు రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. ఏపీలో ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ సీట్ల కోసం నామినేషన్లను ఏప్రిల్ 18 నుంచి 25 వరకు స్వీకరించనున్నారు. అతి తక్కువ రోజులే ఉండే ఈ నామినేషన్ల పర్వం అందరికీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ పకడ్బందీగా నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఒకసారి నామినేషన్ రిజెక్ట్ అయితే మళ్లీ ఐదేండ్ల వరకు అవకాశం రాదు కాబట్టి అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు తెలిపారు అధికారులు.
Nominations : మొదలైన అయిన నామినేషన్ల పర్వం.. పూర్తి వివరాలు మీ కోసం..!
ఇక అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ప్రతి ఒక్కరీ రికార్డు చేయబోతున్నారు అధికారులు. క్యాండిడేట్స్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏప్రిల్ 25 చివరి తేదీ అని.. 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. ఇక మే 13న పోలింగ్ జరగబోతోంది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతే కాకుండా జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించబోతున్నారు. గురువారం ఉదయం చాలా మంది నామినేషన్లు వేస్తున్నారు.
చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. ఇందులో పోటీ చేసే అభ్యర్థులు తమ కుటంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, అంతే కాకుండా వారిపై నమోదైన కేసులను కూడా పొందుపరచాల్సి ఉంటుంది.
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్కు ఇది…
This website uses cookies.