Categories: NewsTrending

NTR Family : ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆగ‌స్ట్ గండం.. ఎందుకు ఇలా చ‌నిపోతున్నారు?

Advertisement
Advertisement

NTR Family : కొంద‌రికి కొన్ని ర‌కాల గండాలు ఉంటాయి. ఆ గండాలు గ‌ట్టెక్కేందుకు పూజ‌లు చేయ‌డం, లేదంటే దోష నివార‌ణ‌కు వేరే మార్గాలు ఎంచుకోవ‌డం వంటివి చేస్తుంటారు. అయితే విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు ఫ్యామిలీకి ఆగ‌స్ట్ గండం ఉంది. ఆయ‌న ఫ్యామిలీలో చాలా మంది ఆగ‌స్ట్‌లోనే చ‌నిపోయారు. తాజాగా ఎన్టీఆర్ కూతురు ఉమా మ‌హేశ్వ‌రి కూడా ఆగస్ట్‌లో చనిపోవ‌డంతో ఈ విష‌యం హాట్ టాపిక్ అయింది. మ‌రి ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఎవ‌రెవ‌రు ఆగ‌స్ట్‌లో చ‌నిపోయారు, ఆ సంగ‌తులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. టీడీపీ వ్యవస్థాపకులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే నందమూరి హరికృష్ణ ఆయన కుమారుడు జానకీరామ్ ఆకస్మిక మరణాలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వారి మరణాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మ‌యంలో ఉమామహేశ్వరి ఆత్మహత్య వారిని శోకసంద్రంలో ముంచింది.

Advertisement

రాజకీయా పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. అప్పటి వరకు రాష్ట్రాల్లో పెత్తనం చేస్తున్న జాతీయ పార్టీల హవాకు గండికొట్టి రీజినల్‌ పార్టీలను తెర మీదకు తీసుకువచ్చారు. తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచివుండే అతికొద్దిమంది వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ సంతానం ఎంతమంది అన్న విషయం ఈ జనరేషన్‌లో తెలిసింది ఎంత అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎన్టీఆర్‌కు 12 మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు కాగా… నలుగురు కూతుళ్లు. వీరిలో కుమారులు నందమూరి రామకృష్ణ సీనియర్ , నందమూరి జయకృష్ణ, నందమూరి సాయికృష్ణ, నందమూరి హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, నందమూరి జయశంకర్ కృష్ణ కాగా.. కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.

Advertisement

NTR Family members are dieing in August Month

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. మరో కుమారుడు నందమూరి సాయికృష్ణ కూడా అనారోగ్యంతో 2004లో కన్నుమూశారు. ఇక అన్నగారికి ఎంతో ఇష్టమైన మరో కుమారుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్ట్‌లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడైన నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ 6న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైంది.

ఎన్టీఆర్ కుటుంబంలో బయటి ప్రపంచానికి తెలిసినవారు కొందరే. వీరిలో ఉమామహేశ్వరి కూడా ఒకరు. కుటుంబ వేడుకలు, ఫంక్షన్లలో మాత్రమే ఆమె కనిపించేవారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడటంతో దీనిని ఖండించేందుకు మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ ఏడాది మొదట్లో చిన్న కుమార్తె దీక్షిత వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఉమామహేశ్వరి. దాదాపు పాతికేళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు కలుసుకుంది ఈ పెళ్లిలోనే. ప్రస్తుతం అంతా సంతోషంగా వున్న సమయంలో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. అస‌లు వీరు ఆగ‌స్ట్‌లోనే ఎందుకు ఇలా క‌న్నుమూస్తున్నారు అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

కంఠమనేని ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకి పాల్పడిందని ఆమె కూతురు దీక్షిత మీడియాతో వెల్లడిచారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోందని, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తుంది. ఉమామహేశ్వరిని మొదట ఎన్టీఆర్‌.. నరేంద్ర రాజన్‌ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడట. అనుకోని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆమె జీవితంలో ఇది విషాదకర సంఘటన. ఆ తర్వత ఆమెకి కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో రెండో వివాహం జరిగింది.

Recent Posts

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

12 minutes ago

Mutton : సంక్రాంతి పండుగ వేళ మీరు మటన్ కొనేటప్పుడు.. ఇవి గమనించలేదో అంతే సంగతి..!

Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

43 minutes ago

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

2 hours ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

3 hours ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

4 hours ago

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

10 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

11 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

13 hours ago