
NTR : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ ఎంటైనర్ రూపొందనుందని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత వాస్తవంగా మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇదే అని గత ఏడాది మొత్తం ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ప్రాకెల్ట్ ఉన్నట్టు అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. కాని మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి కన్‌ఫర్మేషన్ రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతలు మాత్రం మైత్రీ వారు అన్న మాట బలంగా వినిపించింది. ఈ ఇద్దరి తో ప్రాజెక్ట్ అంటే నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ తప్ప వేరే వాళ్ళ పేరు వినిపించలేదు.
ntr-mytri-movie-makres-confirmed-ntr-prashanth-neel-project
కాగా ఈ విషయాన్ని తాజాగా మైత్రీ వారు అఫీషియల్ గా కన్‌ఫర్మ్ చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఈ సినిమా 10 రోజుల షెడ్యూల్ కూడా ఫినిస్ చేశాడు ప్రశాంత్ నీల్. త్వరలో భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవబోతోంది. కాగా ఈ సినిమా ని 4 నుంచి 5 నెలల్లో కంప్లీట్ చేయబోతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. కాగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామా ని తెరకెక్కించబోతున్నాడు.
2022 ప్రథమార్థంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ చివరికి కంప్లీట్ అవబోతోందట. ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మొదలవనుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.