Tasty Snacks : ఓట్స్ తో స్వాంజీ లాంటి ఇడ్లీ ఈజీగా తయారు చేయడం ఎలా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tasty Snacks : ఓట్స్ తో స్వాంజీ లాంటి ఇడ్లీ ఈజీగా తయారు చేయడం ఎలా!

 Authored By rohini | The Telugu News | Updated on :8 July 2022,7:00 am

Tasty Snacks : ఓట్స్ దీనిలో మంచి పోషకాలు ఉన్నాయి. ఫైబర్, ఐరన్, ప్రోటీన్స్ దీనిలో అధికంగా ఉంటాయి. ఈ ఓట్స్ డైట్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఓట్స్ తో ఇడ్లీ, ఇడ్లీ అంటేనే ఎంతో సులువుగా ఆరిగిపోతుంది. చిన్నపిల్లల కైనా పెద్దవాళ్లకైనా డైజేషన్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఇడ్లీలు అందరూ ఇష్టపడుతుంటారు. ఈ ఇడ్లీలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మినప ఇడ్లీ అలాగే కొన్ని కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. ఈఇడ్లీని అయితే ఓట్స్ తో ఇలా కొత్తరకం ఇడ్లీ ని అలాగే ఇడ్లీతో స్నాక్ ను చేయడం ఎలాగో చూద్దాం.. ఇడ్లీకి కావలసిన పదార్థాలు: ఓట్స్, పెరుగు, ఇడ్లీ రవ్వ, సోడా ,నీళ్లు మొదలైనవి. ఇడ్లీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు ఇడ్లీ రవ్వను, వేసి దానిలో ఒక కప్పు పెరుగు ,వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక కప్పు ఓట్స్ ను తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు రోస్ట్ చేసుకొని దానిని మిక్సీలో వేసి పొడి లాగా చేసుకోవాలి. ఈ పొడిని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని దానిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకొని, ఇడ్లీ పాత్రలో వేసి 15 నిమిషాల తర్వాత దింపేయాలి. అంతే ఓట్స్ తో ఎంతో ఈజీగా ఇడ్లీ రెడీ. అలాగే ఇడ్లీతో స్నాక్ ను చేయడం ఎలాగో చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : మిగిలిపోయిన ఇడ్లీలు, నెయ్యి, నూనె, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, టమాట ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నీళ్లు, కొత్తిమీర మొదలగునవి..

Oats with Swanji Easy Idli Tasty Snacks video

Oats with Swanji Easy Idli Tasty Snacks video

దీని తయారు చేసే విధానం : ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి ఈ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి, దానిలో అర స్పూను జీలకర్ర, ఎల్లుల్లి తరుగు రెండు స్పూన్లు, కొన్ని క్యాప్సికం ముక్కలు , కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిసేపు వేయించుకోవాలి తరువాత దాన్లో టమాట ప్యూరీ అరకప్పు వేసుకోవాలి. తర్వాత దానిలోంచి ఆయిల్ బయటకు వచ్చేవరకు వేయించుకొని దానిలోకి ధనియా పౌడర్ ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం, వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీలను దీనిలో వేసి కొద్దిసేపు రోస్ట్ అవ్వా నివ్వాలి. తరువాత వీటిని దింపేముందు కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవాలి అంతే ఇడ్లీతో స్నాక్ రెడీ.

Also read

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది