OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వసూళ్లు రాబట్టింది అంటే..!
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. తొలి రోజే భారీ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపిన ఓజీ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్స్ సాధించింది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి వరల్డ్ వైడ్‌గా ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

#image_title
రికార్డ్ కలెక్షన్స్..
ఇక ఇండియా వైడ్ మొత్తం 9,642 షోలకు గాను 65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టగా, ఇందులో ఆంధ్రాలో 4,183 షోలకు గాను 30.80 కోట్ల రూపాయలు.. తెలంగాణలో 2,628 షోలకు గాను 26 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.37 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.20 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్ సాధించిన ఓజీ.. పెయిడ్ ప్రీమియర్స్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది.
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా 3.65 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 27 కోట్ల రూపాయలు) రాబట్టింది ఓజీ. ఇందులో ఒక్క నార్త్ అమెరికా నుంచే 24.85 కోట్ల రూపాయలు రాగా.. ఇతర దేశాల నుంచి 7.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఓజీ 150 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.