
opposition parties in ap not using ys jagan failures
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కారు తప్పులు తక్కువ చేస్తూ మెప్పులు మస్తుగా పొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పొలిటికల్ గా లబ్ది పొందేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. కానీ బంగారం లాంటి ఛాన్స్ ని బూడిదలో పోసిన పన్నీరులా వేస్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన విపక్ష పార్టీ తెలుగుదేశం.. సీఎం జగన్ చేస్తున్న ఒకటీ అరా మిస్టేక్స్ ని కూడా జనంలోకి బలంగా తీసుకుపోలేకపోతోంది. అధికార పార్టీ వైఎస్సార్సీపీ పైన నిత్యం ఆన్ లైన్ లో (సోషల్ మీడియాలో, జూమ్ మీటింగుల్లో) విమర్శలైతే చేస్తోంది. కానీ ఆఫ్ లైన్ లో, ఫీల్డ్ లెవల్ లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా వెళ్లి చూడట్లేదు. ప్రజాభిమానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నించట్లేదు. దీంతో రానున్న రోజుల్లో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ ఆశలు నెరవేరే సూచనలు కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ysrcp
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రస్తుతం పబ్లిక్ లో కొద్దోగొప్పో నెగెటివ్ ఫీలింగ్ ఉందంటే అది కూడా కరోనా కారణంగానే తప్ప మరొకటి కాదు. దాన్ని కూడా అపొజిషన్ పార్టీ వందకు వంద శాతం తనకు ప్లస్ గా మలచుకోలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం ఎలా అందుతోందో పరిశీలించాలి. రోగులను అడిగి తెలుసుకోవాలి. వాళ్ల సమస్యలను గవర్నమెం ట్ కి తెలియజేయాలి. ఇవన్నీ చేయటం చంద్రబాబుకు కొంచెం కష్టమే. ఎందుకుంటే ఆయన ఇప్పటికే ఏజ్ బార్ అయ్యారు. ఆ లోటును ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భర్తీ చేయాలి. కానీ ఆ లోకేష్ తన హెల్త్(ఒళ్లు తగ్గించుకోవటం)పైనే ఫోకస్ పెట్టారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి మాత్రం అంత శ్రద్థ చూపట్లేదని విమర్శకులు అంటున్నారు.
opposition parties in ap not using ys jagan failures
ఒక్క టీడీపీ మాత్రమే కాదు. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలదీ ఇదే వరస. పొలిటికల్ గా పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేనలు కూడా యాక్టివ్ గా వ్యవహరించట్లేదు. జనం గురించి ఇప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల ముందు వచ్చి ప్రగల్భాలు పలికితే ప్రయోజనం ఏముంటుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే క్యాడర్ బలంగా ఉన్న టీడీపీ వైపే ఎక్కువ వేళ్లు లేస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏవిధంగా అయితే ప్రతిక్షణం ప్రజల్లో ఉన్నాడో అలాగే ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ లాంటి పాపులారిటీ కలిగినవాళ్లు పాలిటిక్స్ లో నిలదొక్కుకోలేరని, వైఎస్ జగన్ సర్కారుకు ప్రత్యామ్నాయం కాలేరని అనిపిస్తోంది. మానవ సేవే మాధవ సేవ మాదిరిగా నిజమైన ప్రజాసేవే అధికారానికి అసలైన తోవ గ్రహించాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.