YS Jagan : ఆ వైసీపీ ఎంపీకి ఎన్ని కష్టాలో.. ఎంపీగా గెలిచి సమస్యల్లో చిక్కుకున్నారా..?
YSRCP : కొందరు గెలిచి అదృష్టవంతులు అవుతారు. కొందరు ఓడిపోయి అదృష్టవంతులు అవుతారు. ఇంకొందరు గెలిచి కూడా దురదృష్టవంతులు అవుతారు. వాళ్లు గెలిచినా కూడా వాళ్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఇలా రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. గెలిచినా.. ఓడినా.. రాజకీయ నాయకుడు అంటేనే ప్రజల్లో ఉండాలి. నిత్యం ప్రజల్లో ఉంటేనే రాజకీయ నేతకు గుర్తింపు. లేకపోతే.. ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం.. ఆ నేత రాజకీయాల్లో ఉన్నారన్న విషయాన్ని కూడా జనాలు మరిచిపోతుంటారు.
అలాగే జరిగింది ఓ ఎంపీకి. పేరుకు అధికార పార్టీకి చెందిన ఎంపీ. కానీ.. ఏంటి లాభం. ఆయన్ను పట్టించుకునే నాథుడే లేడు. ఎంపీ కాకముందు అయినా ఆయనకు కాస్తో కూస్తో గౌరవం ఉండేది. గుర్తింపు ఉండేది. ఇప్పుడు మాత్రం ఉన్నది కూడా పోయింది. ఎంపీ అయ్యాక.. అసలు తన నియోజకవర్గాన్నే మరిచిపోయారట సదరు ఎంపీ. మనం మాట్లాడుకునేది ఏ ఎంపీ గురించి అంటారా? కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గురించే మనం మాట్లాడుకునేది.
YSRCP : గెలిచి రెండేళ్లు అవుతున్నా.. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు
సంజీవ్ కుమార్ ఎంపీగా గెలిచి.. రెండేళ్లు అవుతుంది. కానీ.. ఆయన తన నియోజకవర్గాన్ని పెద్దగా పర్యటించింది లేదు. అసలు వైసీపీ నాయకులతో కూడా ఆయన టచ్ లో లేరట. దీంతో జిల్లా స్థాయి నాయకులు కూడా సంజీవ్ కుమార్ ను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేయడం లేదు. అసలు.. సంజీవ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అన్న అనుమానం నియోజకవర్గ ప్రజల్లో కలుగుతోంది. కర్నూలు ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను లైట్ తీసుకున్నారట. అందరూ తనను లైట్ తీసుకోవడంతో.. ఆయన కూడా అందరినీ లైట్ తీసుకున్నారట.
నిజానికి.. డాక్టర్ సంజీవ్ కుమార్ ను ఏరికోరి మరీ.. జగన్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత కావడం.. కర్నూలులో పేరు ఉండటంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయన గెలిచిన తర్వాత మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడంతో.. అది పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చుతోందని విశ్లేషకులు అంటున్నారు. తన సొంత పార్టీ వైసీపీ నుంచే.. కొందరు నేతల వల్ల ఇబ్బందులు ఏర్పడటం వల్లనే ఆయన రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.