YS Jagan : ఆ రోజే విశాఖకు తరలనున్న ఏపీ రాజధాని..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఆ రోజే విశాఖకు తరలనున్న ఏపీ రాజధాని..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 June 2021,12:25 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం తన ఫోకస్ ను మొత్తం వచ్చే ఎన్నికల మీదనే పెట్టారు. అంటే 2024 లో రాబోయే ఎన్నికల మీదనే. దాని కోసం ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి ఎన్నికలు ఇంకో మూడేళ్లకు వస్తాయి కానీ.. పార్టీలకు ఉన్న సమయం రెండేళ్లే అని అనుకోవాలి. చివరి సంవత్సరం మొత్తం ఎన్నికల వ్యూహాలు, హడావుడి, అభ్యర్థులు.. దీంతోనే సరిపోతుంది. అందుకే.. ఈ రెండేళ్ల సమయంలోనే.. సీఎం జగన్ చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది.. మూడు రాజధానుల అంశం. అవును.. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం కానీ.. ఇప్పటి వరకు ఇది ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. కోర్టుల్లోనే నానుతోంది ఈ అంశం.

three capitals issue in andhra pradesh telugu

three capitals issue in andhra pradesh telugu

మూడు రాజధానులు ఉంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. కనీసం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా తీవ్రంగా అడ్డంకులు వస్తున్నాయి. రాజధానుల విషయంపై ఇప్పటికే చట్టం అయినా కూడా రాజధాని మాత్రం తరలిపోవడం లేదు. కోర్టుల్లో విచారణ స్టేజ్ లో ఉండిపోయాయి.

YS Jagan : ఏ క్షణమైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు.. అంటూ సంకేతాలు

ఇక.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. మూడు రాజధానుల అంశం ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత బెటర్ అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందకే.. కొత్తగా రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. విశాఖకు త్వరలోనే రాజధాని తరలి వెళ్తుంది.. ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏ క్షణమైనా అక్కడ నుంచి పరిపాలన ప్రారంభం కావచ్చు.. అంటూ వైసీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు.. ఎంపీ విజయసాయిరెడ్డి.. వీళ్లిద్దరూ ఇప్పుడూ ఇదే పాట పాడుతున్నారు. దీంతో మరోసారి మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.

three capitals issue in andhra pradesh telugu

three capitals issue in andhra pradesh telugu

కావాలనే.. వైసీపీ హైకమాండ్ వీళ్లతో ఈ మాటలు చెప్పిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నికల వ్యూహమేనని చెబుతున్నారు. అలాగే.. వైజాగ్ లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కూడా సిద్ధమైపోయింది. సీఎం జగన్ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే పరిపాలన రాజధాని అవుతుంది కాబట్టి.. ఆ కాన్సెప్ట్ తో సీఎం జగన్.. వైజాగ్ కు వెళ్లి అక్కడి నుంచే పాలన సాగించాలని భావిస్తున్నారట. ఇదే లాజిక్ తో విశాఖకు రాజధానిని తరలించాలని ప్లాన్. అందుకే.. త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలివెళ్తుంది.. అని వైసీపీ నేతలు డప్పు కొడుతున్నారు. ఇవాళో.. రేపో.. కరోనా తగ్గగానే.. సీఎం జగన్ అన్నీ సర్దుకొని విశాఖ వెళ్లి.. అక్కడి నుంచి పరిపాలన సాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. విశాఖకు రాజధాని ఎప్పుడు తరలి వెళ్తుందో?

ఇది కూడా చ‌ద‌వండి==> YS Jagan : ఏంటీ .. వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూలిపోతుందా..?

ఇది కూడా చ‌ద‌వండి==> TDP : మనిషిక్కడ.. మనసక్కడ.. వైసీపీలో చేరడానికి ఆ టీడీపీ సీనియర్ నేత ఆరాటం?

ఇది కూడా చ‌ద‌వండి==> YSRCP : రఘురామకృష్ణంరాజు ప్లేస్ లో కత్తి లాంటి నేతతో భర్తీ చేస్తున్న సీఎం జగన్?

ఇది కూడా చ‌ద‌వండి==> వీడియో వైరల్‌.. వ‌ధువుకి బ‌దులు అత్త మెడ‌లో వేసిన వ‌రుడు..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది