Free schemes : ఉచిత పథకాలతో మన దేశం కూడా మరో వెనిజులలా అవుతుందా.. ఒకసారి ఆలోచించండి మేధావుల్లారా..?
Free schemes : పదవి కోసం పెన్షన్లు, రుణమాఫీలు, ఉద్యోగ భృతి, ఉచిత సర్వీస్ ల ఆఫర్ ద్వారా మన దేశాన్ని నాయకులు వెనిజులా మార్చుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. వెనిజులా దేశం ప్రపంచంలోనే 21వ ధనిక దేశంగా పేరు పొందింది. ఒక నాయకుడు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి, పేదలకు నెలనెల ధన సహాయం ప్రకటించారు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. మహిళలకు ఉచిత కానుకలు ఇచ్చాడు. 2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారాన్ని సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకే రొట్టెలు మిగతా నిత్యవసర వస్తువులు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడ్డాయి.
దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు, హ్యాపీగా తినడం, ప్రభుత్వం ఇచ్చే భృతితో ఆనందంగా ఉండడం, ఉచితంగా వచ్చిన డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలేదు. 2008లో ఆయిల్ ధర పడిపోవడంతో కరెన్సీ ముద్ర పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసకు విలువ లేకుండా పోయింది. 2018 వచ్చేసరికి దేశం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. సబ్సిడీలు రాకపోవడంతో యువత కత్తులు, కటార్లతో రౌడీలాగా తయారయ్యి జనాలను హింసించ సాగారు. లంఛ కొండి దేశంగా మారిన అత్యంత భయంకరమైన రక్తపాతాల దేశాలలో ఒకటిగా వెనిజులా లిస్ట్ అయింది. టూరిస్ట్లను ఆ దేశాలకు వెళ్లవద్దని మిగతాదేశాలు హెచ్చరిస్తున్నారు.
దిగుమతికి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకు ఒకసారి గంట నీళ్ళు, తినడానికి డబ్బులు కూడా లేక రోడ్లమీద అడుక్కునే స్థితికి వచ్చారు. ప్రస్తుతం వెనిజులా దేశం పరిస్థితి ఇలా ఉంది. సమ సమాజం కావాల్సిందే కానీ ఉచితంగా ఇవ్వకూడదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు అలాంటి నాయకులను ప్రజలు రిజెక్ట్ చేయాలి. అప్పుడే మన దేశం మరో వెనిజులాలా తయారవ్వకుండా ఉంటుంది. ఉచితంగా వస్తున్నాయంటే అవి కచ్చితంగా దేశం మీద భారం పడినట్లే. దేశానికి అప్పులు ఎక్కువ అయి ప్రజలు ఇబ్బంది పాలు అవ్వక తప్పదు. ఉచిత సర్వీసుల వలన, పెన్షన్స్ వలన పనిచేయకుండా ఖాళీగా ఉంటారు. దీని వలన దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఇప్పటికైనా నాయకులు అలాంటి ఉచిత సర్వీసులను పెట్టడం ఆపి వేయాలి. లేదంటే దేశం అట్టడుగు స్థాయికి వెళుతుంది. ప్రజల గూడా దీనిని గమనించాలి లేదంటే భవిష్యత్తులో తిండి దొరకటం కూడా కష్టంగా ఉంటుంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.