Free schemes : ఉచిత ప‌థ‌కాల‌తో మ‌న దేశం కూడా మ‌రో వెనిజుల‌లా అవుతుందా.. ఒక‌సారి ఆలోచించండి మేధావుల్లారా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Free schemes : ఉచిత ప‌థ‌కాల‌తో మ‌న దేశం కూడా మ‌రో వెనిజుల‌లా అవుతుందా.. ఒక‌సారి ఆలోచించండి మేధావుల్లారా..?

Free schemes : పదవి కోసం పెన్షన్లు, రుణమాఫీలు, ఉద్యోగ భృతి, ఉచిత సర్వీస్ ల ఆఫర్ ద్వారా మన దేశాన్ని నాయకులు వెనిజులా మార్చుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. వెనిజులా దేశం ప్రపంచంలోనే 21వ ధనిక దేశంగా పేరు పొందింది. ఒక నాయకుడు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి, పేదలకు నెలనెల ధన సహాయం ప్రకటించారు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు ఐదు రెట్లు […]

 Authored By anusha | The Telugu News | Updated on :29 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Free schemes : ఉచిత ప‌థ‌కాల‌తో మ‌న దేశం కూడా మ‌రో వెనిజుల‌లా అవుతుందా.. ఒక‌సారి ఆలోచించండి మేధావుల్లారా..?

  •  పదవి కోసం పెన్షన్లు, రుణమాఫీలు, ఉద్యోగ భృతి, ఉచిత సర్వీస్ ల ఆఫర్ ద్వారా మన దేశాన్ని నాయకులు వెనిజులా మార్చుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది

Free schemes : పదవి కోసం పెన్షన్లు, రుణమాఫీలు, ఉద్యోగ భృతి, ఉచిత సర్వీస్ ల ఆఫర్ ద్వారా మన దేశాన్ని నాయకులు వెనిజులా మార్చుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. వెనిజులా దేశం ప్రపంచంలోనే 21వ ధనిక దేశంగా పేరు పొందింది. ఒక నాయకుడు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి, పేదలకు నెలనెల ధన సహాయం ప్రకటించారు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. మహిళలకు ఉచిత కానుకలు ఇచ్చాడు. 2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారాన్ని సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకే రొట్టెలు మిగతా నిత్యవసర వస్తువులు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడ్డాయి.

దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు, హ్యాపీగా తినడం, ప్రభుత్వం ఇచ్చే భృతితో ఆనందంగా ఉండడం, ఉచితంగా వచ్చిన డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలేదు. 2008లో ఆయిల్ ధర పడిపోవడంతో కరెన్సీ ముద్ర పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసకు విలువ లేకుండా పోయింది. 2018 వచ్చేసరికి దేశం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. సబ్సిడీలు రాకపోవడంతో యువత కత్తులు, కటార్లతో రౌడీలాగా తయారయ్యి జనాలను హింసించ సాగారు. లంఛ కొండి దేశంగా మారిన అత్యంత భయంకరమైన రక్తపాతాల దేశాలలో ఒకటిగా వెనిజులా లిస్ట్ అయింది. టూరిస్ట్లను ఆ దేశాలకు వెళ్లవద్దని మిగతాదేశాలు హెచ్చరిస్తున్నారు.

దిగుమతికి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకు ఒకసారి గంట నీళ్ళు, తినడానికి డబ్బులు కూడా లేక రోడ్లమీద అడుక్కునే స్థితికి వచ్చారు. ప్రస్తుతం వెనిజులా దేశం పరిస్థితి ఇలా ఉంది. సమ సమాజం కావాల్సిందే కానీ ఉచితంగా ఇవ్వకూడదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు అలాంటి నాయకులను ప్రజలు రిజెక్ట్ చేయాలి. అప్పుడే మన దేశం మరో వెనిజులాలా తయారవ్వకుండా ఉంటుంది. ఉచితంగా వస్తున్నాయంటే అవి కచ్చితంగా దేశం మీద భారం పడినట్లే. దేశానికి అప్పులు ఎక్కువ అయి ప్రజలు ఇబ్బంది పాలు అవ్వక తప్పదు. ఉచిత సర్వీసుల వలన, పెన్షన్స్ వలన పనిచేయకుండా ఖాళీగా ఉంటారు. దీని వలన దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఇప్పటికైనా నాయకులు అలాంటి ఉచిత సర్వీసులను పెట్టడం ఆపి వేయాలి. లేదంటే దేశం అట్టడుగు స్థాయికి వెళుతుంది. ప్రజల గూడా దీనిని గమనించాలి లేదంటే భవిష్యత్తులో తిండి దొరకటం కూడా కష్టంగా ఉంటుంది.

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక