బిగ్ న్యూస్‌ : టీడీపీకి మరో భారీ షాక్..? రాజీనామా దిశగా కీలక నేత.. వైసీపీ వైపు…?

Authored By Brahma | The Telugu News | Published on: May 8, 2021, 12:58 pm

Panabaka Lakshmi : తెలుగుదేశం పార్టీకి వరసగా దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారం చేజారిపోయి, కీలక నేతలు పార్టీకి దూరమై, ఉన్న నేతలు మౌనదీక్షలు చేస్తున్న ఈ సమయంలో పార్టీలోని కీలక నాయకురాలు టీడీపీకి రాజీనామా చేసి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి తిరుపతి ఎన్నికలో టీడీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మి పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఆమెకు ఈ ఎన్నికలో పోటీచేయాలని లేకపోయిన కానీ బాబు బలవంతం మీద పోటీకి సిద్ధమైంది. ఆ సమయంలో ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతోనే ఆమె బరిలో నిలిచినట్లు సమాచారం.

panabaka lakshmi thinking of resigning from tdp party

panabaka lakshmi thinking of resigning from tdp party

తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి బాబు చెప్పిన హామీలను నెరవేర్చలేదని తెలుస్తుంది. దీనితో ఆమె ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందులు పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. పైగా గత ఎన్నికల్లో సొంతగా ప్రచారం చేసుకొని మంచి స్థాయిలో ఓట్లు తెచ్చుకున్న పనబాక లక్ష్మి, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ మొత్తం ప్రచారం చేసిన గతంలో వచ్చిన ఓట్లు కంటే తక్కువగానే పోల్ అయ్యాయి.

రాజీనామా చేసి అటు వైసీపీ లేదా ఇటు బీజేపీ : Panabaka Lakshmi

రెండేళ్ల వ్యవధిలో రెండు సార్లు ఓడిపోవటం అనేది ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు పనబాక లక్ష్మి కూడా అదే స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో ఇక టీడీపీ లో ఉంది లాభం లేదని, రాజీనామా చేసి అటు వైసీపీ లేదా ఇటు బీజేపీ లోకి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలోనే పనబాక లక్ష్మికి వైసీపీ నుండి ఆఫర్ వచ్చింది. కానీ ఆమె వెళ్ళటానికి ససేమిరా అనేసి టీడీపీ నుండే పోటీకి దిగి ఓడిపోయారు.
TDP set to field Panabaka Lakshmi in Tirupati LS seatఇక ఇప్పుడు ఆమె వైసీపీ తలుపు తడితే అటు నుండి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి. ఇక మరోపక్క బీజేపీలోకి వెళితే రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయిన కానీ కేంద్రంలో ఉంది కాబట్టి పైగా తనకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కనుక ఎదో ఒక పదవి వస్తుందనే ఆలోచనలో కూడా పనబాక ఉన్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగి ఆమె టీడీపీకి రాజీనామా చేస్తే తిరుపతిలో టీడీపీకి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.

Brahma

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp