Pawan- Balayya | ఆ ప‌ద‌వి కోసం ఆస‌క్తిక‌ర పోటీ.. ప‌వ‌న్ వర్సెస్ బాల‌య్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan- Balayya | ఆ ప‌ద‌వి కోసం ఆస‌క్తిక‌ర పోటీ.. ప‌వ‌న్ వర్సెస్ బాల‌య్య‌

 Authored By sandeep | The Telugu News | Updated on :3 September 2025,3:00 pm

Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు లేదు అన్నది నిజమైన మాట. ఆయన మాటకు సీఎం, మంత్రులు కూడా మద్దతుగా ఉంటారు. అయితే పవన్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత రత్నంపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే అంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ గా నిర్మాత ఎ.ఎం.ర‌త్నం పేరును ప్రతిపాదించినట్లు ప్రీ రిలీజ్ వేడుక లోస్టేజ్ పై చెప్పారు.

#image_title

బాల‌య్య సై..

పక్కా రత్నం ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఆయన ఎంపిక లాంఛనమే అని కూడా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రేస్ లోకి మరో నిర్మాత పేరును తీసుకురావ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. బాల‌య్య ఈ ప‌ద‌వికి మ‌రొక‌రి పేరుని ప్ర‌తిపాదించారని స‌మాచారం అందుతోంది.

అయితే బాలయ్య ప్రతిపాదించింది కూడా స‌మ‌ర్థుడైన వ్య‌క్తి అని, ఆ నిర్మాత పేరు మాత్రం తెరపైకి రాలేదు అని అంటున్నారు.. మ‌రి ఈ పదవికి ప్రభుత్వం ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు జులై 24న గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రారంభించగా.. జ్యోతి కృష్ణ ముగించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ పాన్ఇండియా భాషల్లో తెరకెక్కింది. రెండు పార్ట్ లుగా ఈ సినిమా రానుంది. ఇందులో భాగంగానే తొలి పార్ట్ రిలీజైంది. వచ్చే ఏడాది రెండో భాగం వచ్చే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది