Pawan Kalyan : జగన్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ చంద్రబాబుని అడ్డంగా బుక్ చేసిన పవన్ కల్యాణ్ ….!
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. రాజకీయాలను ఆయన పదును పెట్టారు. అసలు ఏపీలో రాజకీయాలు అంటేనే పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం.. ప్రధాని మోదీని పవన్ కలవడం. ఎప్పుడైతే పవన్ ను మోదీ కలిశారో అప్పటి నుంచి ఏపీలో జనసేన పార్టీ క్రేజ్ పెరిగిపోయింది. అంతకుముందే వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్.. అమరావతి రైతుల విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. ఇప్పటం గ్రామ ప్రజలకు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే.. వాళ్లను అమరావతి రైతులతో పోల్చారు. అమరావతి రైతులు.. క్యాపిటల్ కోసం చాలా రోజుల నుంచి పాదయాత్ర, పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ, తెగింపును.. అమరావతి రైతులు చూపించి ఉంటే.. అసలు రాజధాని ఇక్కడి నుంచి కదిలి ఉండేది కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పటం గ్రామ ప్రజల తెగింపు గురించి మాట్లాడుతున్నారంటే.. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం కావాలనే.. ఉద్దేశపూర్వకంగా ఇళ్లను కూల్చేసిందనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ. అయితే.. ముందగానే నోటీసులు ఇచ్చారని.. ప్రహారీలు మాత్రమే కూల్చామని చెబుతున్నా.. అసలు.. తమకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదని గ్రామస్తులు కూడా చెబుతున్నారు.
Pawan Kalyan : ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇప్పటంలో ఇళ్లు కూల్చేసిందంటున్న పవన్
ఇప్పటికే కూల్చివేతపై స్టే కూడా పొందారు గ్రామస్థులు. ఇప్పటికే తమ ఇళ్లను కోల్పోయిన గ్రామ ప్రజలకు కొందరికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆ సమయంలోనే ఇప్పటం గ్రామ ప్రజలను, అమరావతి రైతులతో పోల్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు రాజధాని కోసం తమ భూములను ఇచ్చారని.. జగన్ సీఎం అయ్యాక.. ఒక్క రాజధాని పోయి. మూడు రాజధానుల నిర్ణయం తెర మీదికి వచ్చిందన్నారు. ఒక్క రాజధాని కోసం అక్కడి రైతులు పోరాటం చేస్తున్నారు. వాళ్లకు ఒకప్పుడు పవన్ కూడా మద్దతు ఇచ్చారు కానీ.. ఇప్పుడు ఇప్పటం గ్రామ ప్రజలకు ఉన్న తెగింపు వాళ్లకు లేదని చెప్పడంపై సరికొత్త చర్చ మొదలైంది.