జ‌న‌సేన‌లో అన్యూహ ప‌రిణామాలు.. ప‌వ‌ణ్ ఇక నిర్ణ‌యం మార్చుకోక త‌ప్ప‌దా..?

0
Advertisement

pawan kalyan రాజకీయాల్లో శాస్వత మిత్రులు కాని శాస్వత శత్రువులు కాని ఉండరు. ఆ విషయాన్ని జనసేన బాగా ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. జనసేన పుట్టిన వెంటనే బీజేపీకి మద్దతు ఇచ్చింది. ప్రత్యేక ఏపీకి బీజేపీ ప్రభత్వం తీవ్ర అన్యాయం చేసింది అంటూ ఆ మద్య జనసేన పై విమర్శలు వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా మోడీ ప్రభుత్వం నెరవేర్చక పోవడంతో ఆ సమయంలో బీజేపీకి దూరం అవుతున్నట్లుగా జనసేనాని ప్రకటించాడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసిన జనసేన మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మొన్నటి ఎన్నికల్లో ముందుకు వెళ్లింది.

జనసేన కార్యకర్తలు అసంతృప్తి.. pawan kalyan

ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రమే. ఇటీవల తీసుకున్న విశాక స్టీల్‌ ప్రైవేటీకరణ మరియు ప్రత్యేక హోదా విషయం లో బీజేపీ పై ఏపీ ప్రజలు కోపంతో రగిలి పోతున్నారు. కనుక ఈ సమయంలో జనసేన మరియు బీజేపీ కలిసి పని చేయడం అవివేకం అవుతుందని జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి కూడా ఏపీలో బీజేపీ నాయకులు కేంద్రం నుండి ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్ట్‌ లు కాని నిధులు కాని తీసుకు రాలేక పోయారు. ఆ కారణంగా బీజేపీ నాయకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

pawan kalyan change the decision
pawan kalyan change the decision

త్వరలో విడాకుల నిర్ణయం.. pawan kalyan

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మద్య కాలంలో ఎన్నికలు ఏమీ లేకున్నా కూడా త్వరలోనే జనసేన పార్టీ  pawan kalyan మరియు బీజేపీ పార్టీలు విడిపోయే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ విశ్లేషకుల వాదన మేరకు అతి త్వరలోనే రెండు పార్టీలు కూడా విడాకులు తీసుకోవడం ఖాయం అంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే పలు సందర్బాల్లో విభేదాలు కలిగి ఉన్నాయి. కనుక వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు అసాధ్యం అంటున్నారు.

Advertisement