Pawan Kalyan : మహానాడు గురించి పవన్ కళ్యాణ్ వాకబు
Pawan Kalyan : తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమం ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తో పాటు లోకేష్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పర్చేందుకు ఎప్పటిలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లోకి వెళ్లాలని తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.మహానాడు కార్యక్రమం గురించి వివిధ రాజకీయ పార్టీలు వాకబు చేయడం మొదలు పెట్టాయి.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఉన్న మీడియా సోర్స్ మరియు ఇతర తెలుగు దేశం పార్టీ నాయకుల ద్వారా మహా నాడు గురించి అడిగి తెలుసుకున్నాడట. తెలుగు దేశం పార్టీ కి గతంతో పోల్చితే బలం చాలా తక్కువ అయ్యింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ ఆలోచనలో ఉన్నాడని సమాచారం అందుతోంది.మహానాడు గురించి పవన్ కళ్యాణ్ సన్నిహితులతో చర్చించాడట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా మహానాడు గురించి వాకబు చేస్తున్నాడట.
మహానాడు లో జనసేనతో పొత్తు గురించి ఏమైనా చంద్రబాబు మాట్లాడాడా అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మీడియా వారిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జనసేనాని చాలా క్లోజ్ గా క్లియర్ గా తెలుగు దేశం పార్టీని గమనిస్తూ ఉన్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంకు ఒక అవగాహణ వస్తాడా లేదా అనేది చూడాలి. వీరిద్దరి కలయిక ను జనాలు నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.