Pawan Kalyan : జగన్ 175 నియోజకవర్గాల ఛాలెంజ్.. పవన్ కళ్యాణ్ అదిరిపోయే కౌంటర్ వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : జగన్ 175 నియోజకవర్గాల ఛాలెంజ్.. పవన్ కళ్యాణ్ అదిరిపోయే కౌంటర్ వీడియో..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :2 March 2023,9:20 pm

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగా అధికార ప్రతిపక్షాల మధ్య పరిస్థితులు క్రియేట్ చేశాయి. ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్.. దమ్ముంటే 175 నియోజకవర్గాలలో నాపై సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా అని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి తెనాలి సభలో సవాల్ విసరటం సంచలనం సృష్టించింది. అయితే ఈ సవాల్ పై తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాలుగా స్పందించారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈ విషయంలో మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు ఓ వీడియోను పోస్ట్ చేసి…

Pawan Kalyan Counter Words To YS Jagan Comments About 175 Seats

Pawan Kalyan Counter Words To YS Jagan Comments About 175 Seats

జగన్ 175 నియోజకవర్గాల సవాల్ కీ కౌంటర్ గా వైరల్ చేస్తున్నారు. గతంలో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇది. ఈ వీడియోలో తనకు అధికారం లేకపోయినా కానీ తన గురించి ప్రధాని మోడీ దగ్గర వైసీపీ నాయకులు చాడీలు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. నాకు ఏదైనా గొడవ ఉంటే నేను పుట్టిన నెల ఆంధ్రాలోనే తేల్చుకుంటా. నేను ఢిల్లీ వెళ్లి ఎవరికీ చాడీలు చెప్పను. నేను ఆంధ్రుడిని… ఇక్కడే తేల్చుకుంటా. నా దగ్గర ఏం అధికారం లేకపోయినా గాని ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా

Jana Sena Party to champion cause of people- The New Indian Express

గానీ పోలీసులు వైసీపీ నాయకులు భయపడిపోతున్నారు అంటే.. మీరే అర్థం చేసుకోవాలి అని పవన్ స్పీచ్ ఇచ్చారు. ఇదే సమయంలో గుండెలో సప్త ఉంది కాబట్టే.. నేనంటే భయపడి ఢిల్లీ వెళ్లి మరి నా గురించి చాడీలు చెబుతున్నారు అని అన్నారు. మాతో సంస్కారంగా ఉంటే చాలా మర్యాదగా ఉంటాం. నీచంగా ప్రవర్తిస్తే మాలాంటి విప్లవకారులు మరొకరు కనిపించరు అని పవన్ అప్పట్లో వారిని ఇచ్చిన వీడియో అని జగన్ 175 నియోజకవర్గాల ఛాలెంజ్ కీ కౌంటర్ గా జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది