Pawan Kalyan : రిజల్ట్స్ తర్వాత సరిగ్గా మీసాలు లేని వ్యక్తి కూడా నా ముందు మెలేశాడు.. ఆలీపై పరోక్షంగా పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్..!!
Pawan Kalyan : జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుక చాలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం ఏపీకి చేరుకోవటం జరిగింది. చేరుకున్న వెంటనే మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో బీసీ సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధించుకోవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా ఓడిపోయిన తర్వాత పార్టీని నడపాలంటే చాలా కష్టతరం.
ఎన్నికలలో తాను ఓడిపోయిన తర్వాత…తన అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని వ్యక్తులు తన ముందు వచ్చి తొడలు కొట్టారని… లేని మీసాలు మెలేశారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా గాని రాజకీయాలు ఈ రకంగా నిలబడటానికి గల కారణం జనసేన గెలుపు బీసీల గెలుపు అని స్పష్టం చేశారు. దీంతో మీసాలు లేని వ్యక్తి తన ముందు మేలేసారని కామెంట్లకు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది.
కచ్చితంగా అది ఆలీ అని.. చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఆలీ సొంత ఊరు రాజమండ్రిలో నెగిటివ్ కామెంట్లు చేశారు. పవన్ చేసిన కామెంట్లకు దీటుగానే ఆలీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అనంతరం వైసీపీ గెలిచాక… పవన్ కి మరియు ఆలీకి మధ్య మాటలు లేకుండా పోయాయి. దీంతో పవన్ ఓడిపోయాక… సరిగ్గా మీసాలు కూడా లేని ఆలియే మేలేసి ఉంటారని చెప్పుకొస్తున్నారు.