YS Sharmila : వైఎస్ షర్మిలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్? ఆమాత్రం మద్దతు దొరికితే చాలు షర్మిలకు?
YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. కానీ.. షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అంటే ఒక్క నాయకుడు కూడా మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి కానీ.. టీఆర్ఎస్ నుంచి కానీ.. బీజేపీ నుంచి కానీ.. తనకు మద్దతు రాలేదు. అటు ఏపీలోనూ అంతే. తెలంగాణ, ఏపీలో తన పార్టీ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఈనేపథ్యంలో షర్మిల పార్టీ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందని.. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని షర్మిల పార్టీపై ఆయన చెప్పుకొచ్చారు. షర్మిల పార్టీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేం. ఆమె పార్టీని ఇంకా స్థాపించకముందే ఎందుకు మాట్లాడుకోవడం.. పార్టీ విధి విధానాలేంటి? పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలిస్తే కానీ.. ఏం మాట్లాడలేం. కానీ.. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే నేను కోరుకుంటున్నా.. అంటూ షర్మిల పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.
YS Sharmila : షర్మిల వెనుక ఉన్నది బీజేపీనా? లేక కేసీఆరా?
అయితే.. వైఎస్ షర్మిల తన ఆలోచన ప్రకారం తెలంగాణలో పార్టీ పెట్టడం లేదని.. ఇదంతా సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ అంటూ చెబుతున్నారు. మరికొందరేమో.. కాదు కాదు.. ఇది బీజేపీ స్ట్రాటజీ అంటున్నారు. ఇంకొందరేమో.. తన అన్న జగన్ తో ఉన్న విభేదాల వల్ల షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతోందంటున్నారు. రకరకాల ఊహాగానాల మధ్య షర్మిల పార్టీ స్థాపిస్తుండగా… ఆమె పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం మాత్రం అటు ఏపీ, ఇటు తెలంగాణలో చర్చనీయాంశమైంది.