Chandrababu : చంద్రబాబు ఎంత చేతకాని వాడో వివరించిన పవన్ కళ్యాణ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్రబాబు ఎంత చేతకాని వాడో వివరించిన పవన్ కళ్యాణ్..!

Chandrababu : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలు మాట్లాడారు. అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు.. ఏపీలో చరిత్ర సృష్టిస్తామన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. జనసేన పార్టీ గురించి కంటే కూడా చంద్రబాబు నాయుడు గురించి ఆయన పార్టీ గురించే ఎక్కువగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. దీంతో ఇది టీడీపీ సభనా.. లేక జనసేన సభనా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు జనసైనికులు. చంద్రబాబు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 March 2023,8:00 pm

Chandrababu : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలు మాట్లాడారు. అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు.. ఏపీలో చరిత్ర సృష్టిస్తామన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. జనసేన పార్టీ గురించి కంటే కూడా చంద్రబాబు నాయుడు గురించి ఆయన పార్టీ గురించే ఎక్కువగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. దీంతో ఇది టీడీపీ సభనా.. లేక జనసేన సభనా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు జనసైనికులు. చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ముఖ్యమంత్రిగా సమర్థుడు.. అంటూ పవన్ చెప్పుకొచ్చారు.

pawan kalyan talks about tdp president chandrababu naidu

pawan kalyan talks about tdp president chandrababu naidu

జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ఏదైతే జరగకూడదని అనుకుంటున్నదో అదే జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నటికీ బలి పశువు కాదు. ఈ ఎన్నికల్లో మా ఓట్లు వృథా కావు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. అలాగే మా ప్రణాళిక కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లంతా గెలవాలి. జనసేన సత్తా ఏంటో చూపిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మరీ మాట్లాడారు. ఏదో ఒక రోజు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. కాపులు అంతా.. మా కులం నుంచి ఎవ్వరూ ముఖ్యమంత్రి అవ్వలేదు అని అనుకుంటున్నారు. మీరు ఓటేయండి. నేను సీఎం అయి చూపిస్తా. మనలో మార్పు రావాలి.

pawan kalyan talks about tdp president chandrababu naidu

pawan kalyan talks about tdp president chandrababu naidu

Chandrababu : ఒక రోజు జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం

ఓటును అమ్ముకునే మన దగ్గర నుంచే మార్పు ప్రారంభం కావాలి. డిగ్రీ చేసిన వాళ్లు కూడా ఓటు అమ్ముకుంటున్నారు. అపార్ట్ మెంట్ ఉన్నవాళ్లు కూడా ఓటు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే.. చూస్తూ కూర్చోవాలా? ఇంకా ఎంత కాలం వాడు మా కులం.. వీడు మా కులం.. మా వాడు అని వదిలేస్తారు. ఓటును అమ్ముకుంటే మార్పు రాదు.. కులం పెత్తనాలు ఆగాలి. నా మీద ఇష్టం ఉన్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. నాకు తెలంగాణ సీఎం వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారట. నేను తెలంగాణలో పోటీ చేస్తాను అంటే.. బీజేపీ నాయకులు నువ్వ ఆంధ్రా వాడివి కదా అంటారు. ఆంధ్రా వాళ్ల ఓట్లు కావాలి కానీ.. ఆంధ్రా వాళ్లు పోటీ చేయొద్దా అంటూ పవన్ కళ్యాణ్ సభలో మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది