Pawan Kalyan : చంద్రబాబు వెన్నుపోటు రుచి పవన్ కళ్యాణ్ కి ఇప్పటికి అర్ధమైందా ?
Pawan Kalyan : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది సీనియర్ రాజకీయ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి రకరకాల కామెంట్లు చేస్తారు. ఆయనకు అనుకూలంగా ఉండేవారు అపార చాణిక్యుడు అని అంటారు. ప్రత్యర్థులు మాత్రం వెన్నుపోటులకు కేరాఫ్ అడ్రస్ అనీ బాబుపై కామెంట్లు చేస్తూ ఉంటారు. టీడీపీ పార్టీ స్థాపించిన సొంత మామ ఎన్టీరామారావునే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శిస్తారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో… రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వచ్చే ఎన్నికలలో టీడీపీతో కలసి పనిచేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల మచిలీపట్నంలో జనసేన పదవ ఆవిర్భావ మహాసభలో కూడా ఆ రకంగానే ప్రసంగించారు.
పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా… తన వెన్నుపోటు పొడిచిన్నట్లు కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగోండి హరిరామజోగయ్య మరికొంతమంది కాపు నాయకులూ ఇటీవల జరిపిన సమావేశంలో డిస్కషన్ చేసుకున్నట్లు టాక్. విషయంలోకి వెళ్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేస్తే జనసేన పార్టీకి కేవలం 20 సీట్లు మాత్రమే ఇస్తానని పవన్ కి బాబు తెలియజేశారట. ఈ రకంగా గోదావరి జిల్లాలకే జనసేన ని పరిమితం చేసే రీతిలో… బాబు స్కెచ్ వేసినట్లు…దీంతో కాపులకు రాజ్యాధికారం రాకుండా బాబు ట్రాప్ లో పవన్ పడీన్నట్లు చర్చించుకున్నారట. మరోపక్క తనకు అనుకూలంగా ఉండే మీడియాతో పవన్ పై వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారం చేయిస్తున్నట్లు.. . ఈ రకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి… వచ్చే సార్వత్రిక ఎన్నికల సీట్ల విషయంలో వెన్నుపోటు పొడిచినట్లు చేగోండి హరిరామజోగయ్య
అభివర్ణించనట్లు సమాచారం. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని జగన్ అప్పట్లో చెప్పిన కాపు నాయకులు అతని వెనకాల ఎందుకు పడుతున్నారో అని.. పవన్ మచిలీపట్నంలో చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో కాపులు ఖండించారట. వాస్తవానికి కాపుల రిజర్వేషన్ అనే అంశం తన పరిధిలో లేదని అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని తూర్పుగోదావరి జిల్లా సాక్షిగా ఆనాడు జగన్ స్పష్టంగా క్లారిటీ ఇచ్చారని తెలియజేయడం జరిగింది. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజేర్వేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆయన కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తానని… పవన్ మాట ఇచ్చారు. కానీ కాపు రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు మాట తప్పారు పవన్ ఏం చేశారు అని ఈ కాపు సమావేశంలో నాయకులు చర్చించుకున్నట్లు.. సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.