Pawan Kalyan : ఇలా చేస్తే జగన్ కి నేనే సపోర్ట్ చేస్తాను.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన పారిశ్రామిక సదస్సు గురించి ఆయన చెప్పారు. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉందని జనాలు అనడం కాదు. మా మధ్య పొత్తు ఉంది కానీ.. ఆ పొత్తుపై మున్ముందు ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామన్నారు పవన్ కళ్యాణ్.
బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ కూడా కలుస్తోందా? అంటూ మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ఏపీ విభజన తనకు చాలా ఇబ్బంది కలిగించిందన్నారు. బాధ్యాతయుతంగా విభజన జరగలేదని.. ఆంధ్రప్రదేశ్ అనగానే 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు మాత్రమే కాదు కదా. తెలంగాణ వాళ్లు పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. కానీ.. ఏపీలో ఎవరి కన్వీనియెన్స్ ఆధారంగా వాళ్లు మాట్లాడారన్నారు. ఏపీ నేతలు ఢిల్లీలో భయపడిపోయారు. ప్రజల కోసం మీరు ఉన్నప్పుడు పార్టీల గురించి పక్కన పెట్టి ప్రజల తరుపున మాట్లాడాలి.
Pawan Kalyan : ఢిల్లీలో భయపడిపోయారు
ఎందుకు మీది మీరు చూసుకున్నారు. ఈ విషయంలో నేను జనం గొంతు అవ్వాలనుకున్నాను. నా గొంతు ఎత్తాను. పార్టీ పెట్టాను. వైసీపీ వాళ్లు 150 మంది ఎమ్మెల్యేలు ఉండి అద్బుతమైన పాలన ఇస్తే నాకు అనాల్సిన అవసరం ఏముంటుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎవరూ మాట్లాడకుండా ఉంటే, ఎలాంటి క్రైమ్ చేసినా చెల్లిపోద్ది అనుకుంటే ఎలా? జగన్ పాలన బాగుంటే నేనెందుకు ఇలా వాళ్లను విమర్శిస్తాను. అప్పుడు నేను కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తా అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.