Peddi | దసరా గిఫ్ట్‌గా ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ .. అక్టోబర్ 2న రామ్ చరణ్ మ్యూజికల్ బ్లాస్టర్!
Peddi | మెగా అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ సర్‌ప్రైజ్ అందించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) నుండి ఫస్ట్ సింగిల్‌ను అక్టోబర్ 2న, దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది

#image_title
అంచనాలు పీక్స్‌కి…
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇది రామ్ చరణ్‌తో రహమాన్‌కు మొదటి చిత్రం కావడం విశేషం. అలాగే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాతో రెహమాన్ తొలిసారి పని చేస్తున్నారు.టైటిల్ గ్లింప్స్‌కి వచ్చిన నేపథ్య సంగీతం ఇప్పటికే భారీగా వైరల్ అయింది. దీంతో పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దసరా సందర్భంగా, అక్టోబర్ 2న ‘పెద్ది’ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటలో రామ్ చరణ్ మాస్ లుక్, రహమాన్ మ్యూజిక్ కలిసి పండగలా ఉండనున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.‘పెద్ది’ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటి వరకు సుమారు 75 రోజులకు పైగా షూటింగ్ పూర్తయ్యిందని, మిగతా 80 రోజుల షెడ్యూల్ ఉందని సమాచారం.