Hyderabad : లాక్ డౌన్ అని తెలియగానే.. రోడ్ల మీదికి గుంపులుగా వచ్చి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : లాక్ డౌన్ అని తెలియగానే.. రోడ్ల మీదికి గుంపులుగా వచ్చి..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 May 2021,10:00 am

Hyderabad : తెలంగాణలో ఈరోజు నుంచి అంటే మే 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఏ ఒక్కరూ ఉదయం 10 దాటితే బయటికి వెళ్లడానికి లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తప్ప.. బయటికి వెళ్లకూడదు. లాక్ డౌన్ ను 10 రోజుల పాటు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. మిగితా 20 గంటలు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే.. నిత్యావసర సరుకులు, ఇతర పనులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 దాటితే షాపులు అన్నీ మూతపడనున్నాయి.

people flouts social distancing rules in old city hyderabad

people flouts social distancing rules in old city hyderabad

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నాం అని ప్రకటించిందో లేదో.. హైదరాబాద్ పాతబస్తీలో ఇదీ పరిస్థితి. గుంపులు గుంపులుగా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి వచ్చారు. మార్కెట్ కి వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కొని వెళ్లారు. అయితే.. ఏమాత్రం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. ఏమాత్రం కరోనా భయం లేకుండా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి ఇలా గుంపులు గుంపులుగా రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

people flouts social distancing rules in old city hyderabad

people flouts social distancing rules in old city hyderabad

Hyderabad : ప్రజలు ఏమాత్రం కరోనా నియంత్రణకు సహకరించడం లేదు

ఓవైపు కరోనా ఇంతలా భయపెడుతుంటే.. రోజురోజుకూ కరోనా విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రజలు మాత్రం కరోనాను చాలా లైట్ తీసుకుంటున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. చార్మినార్ ప్రాంతంలో పాతబస్తీలో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి గుంపులు గుంపులుగా వచ్చి షాపింగ్ చేశారు. లాక్ డౌన్ ఉంటుంది అనగానే.. ఇలా గుంపులు గుంపులుగా రోడ్ల మీదికి వస్తే.. కరోనా పెరగకుండా ఇంకా తగ్గుతుందా? అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఉన్నా.. ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపు ఉంటుందని..  ఆసమయంలో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి కానీ.. ఇలా ఒక్కసారిగా రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరిగితే.. కరోనా ఎలా తగ్గుతుంది.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

people flouts social distancing rules in old city hyderabad

people flouts social distancing rules in old city hyderabad

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది