PM Kisan E-KYC : ఇదే చివరి అవకాశం… ఇలా చేయండి లేదంటే డబ్బులు పోతాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PM Kisan E-KYC : ఇదే చివరి అవకాశం… ఇలా చేయండి లేదంటే డబ్బులు పోతాయి…

PM Kisan E-KYC : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో ఒకటే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2000 చొప్పున ఏటా రూ.6,000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం కింద 6,000 మీ ఎకౌంట్ లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ- కేవైసీ చేయించుకోవాలి. ఈనెల 31 వ తారీఖు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే ఈ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 July 2022,7:30 pm

PM Kisan E-KYC : కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో ఒకటే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2000 చొప్పున ఏటా రూ.6,000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం కింద 6,000 మీ ఎకౌంట్ లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ- కేవైసీ చేయించుకోవాలి. ఈనెల 31 వ తారీఖు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే ఈ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ, కేవైసీ రెండు విధానాలు వేరు వేరు. ఓటిపి ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ తో ఈ-కేవైసీ ని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీ ని డాక్యుమెంట్లు ఆధారంగా పూర్తి చేశారు.

అయితే ఇంతకుముందే కేవైసీ చేయించిన పిఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బిఐ ఆదేశాల ప్రకారం మనీ లాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలుపరిచారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. దీంతో ప్రజలకు చెందాల్సిన ధనం ఆదా అవుతుంది. ఈ-కేవైసీ ని స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. వెబ్ సైట్ లో ఎంటర్ చేయగానే గెట్ పిఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని దాంట్లో నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీని కస్టమర్ సర్వీస్ సెంటర్లలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు.

PM Kisan E KYC scheme central government provides Rs6000 to farmers annually at the rate of Rs2000

PM Kisan E-KYC scheme central government provides Rs.6,000 to farmers annually at the rate of Rs.2,000

జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో రైతుల సౌకర్యార్థం ఈ-కేవైసీ చేస్తున్నారు అలాగే ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈనెల 31 వ తారీఖు లోపు రైతులు చేసుకోవాలి. లేదంటే ఈ పథకాన్ని కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఈ – కేవైసీ నమోదుకు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2,000 చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6,000 రైతులకు అందుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి రైతు ఆధార్ దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అలాగే ఓటీపీ నెంబర్ ఆధారంగా చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈ-కేవైసీ చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది