PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..!

ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ యోజన పథకం వారా నిధులు వస్తాయి. ఐతే ఈసారి కేంద్రం చెప్పిన విధంగా కార్యరూపం దాల్చబోతుంది. దేశం మొత్తం మీద రైతులకు అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు ఐతే వీటి కోసం రైతులు ఏం చేయాలన్నది చూద్దాం. దేశంలో ఉన్న 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో కేంద్రం 20000 కోట్ల నిధులు పీఎం కిసాన్ పథకం కోసం ఏర్పాటు చేస్తుంది. పీఎం […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..!

ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ యోజన పథకం వారా నిధులు వస్తాయి. ఐతే ఈసారి కేంద్రం చెప్పిన విధంగా కార్యరూపం దాల్చబోతుంది. దేశం మొత్తం మీద రైతులకు అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు ఐతే వీటి కోసం రైతులు ఏం చేయాలన్నది చూద్దాం. దేశంలో ఉన్న 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో కేంద్రం 20000 కోట్ల నిధులు పీఎం కిసాన్ పథకం కోసం ఏర్పాటు చేస్తుంది. పీఎం కిసాన్ పథకం 18వ విడతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. ముంబైలోని అండర్ గ్రౌండ్ మెట్రో ఓపెనింగ్ లో పాల్గిఒన్న ఆయన అదే టైం లో రైతులకు నిధులను విడువల చేశారు. ఐతే రైతుల మొబైల్ ఫోన్లలో మనీ క్రెడిట్ అయిన మెసేజ్ లు వస్తున్నాయి.

రబీ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో..

17వ విడత పీఎం కిసాన్ పథకం ద్వారా జూన్ నెలలో ఫండ్ రిలీజ్ చేయగా ఇప్పుడు నాలుగ్ నెలల తర్వాత రబీ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో 2వేల రూపాయలు జమ చేస్తున్నారు. ఈ నిధులను రైతులు తమ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది.ఐతే ఏ కారణాల వల్ల అయినా నిధులు ఖాతాల్లో జమ కాకపోతే రెండు రోజుల దాకా వెయిట్ చేయాలి అప్పటికి కూడా రాకపోతే బ్యాంక్ కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత పీఎం కిసాన్ (https://pmkisan.gov.in) పోర్టల్ లో లాగిన్ అయ్యి వివరాలు సరిగా ఉన్నాయా లేదా అన్నది సరిచేసుకోవాలి.

PM Kisan పీఎం కిసాన్ నిధులు రిలీజ్ రైతులు ఇలా చేస్తే సరిపోతుంది

PM Kisan : పీఎం కిసాన్ నిధులు రిలీజ్.. రైతులు ఇలా చేస్తే సరిపోతుంది..!

పీఎం కిసాన్ సైట్ లో రైతుల ఖాతాలకు సంబందించిన ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించాలి. ఈ కేవైసీ అవసరం అయితే మాత్రం రైతులు తప్పనిసరిగా ఈ కే వైసీని పూర్తి చేయాలి. అంతేకాదు తమ డీటైల్స్ సరిగా ఇవ్వాలి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ పీఎం కిసాన్ పథకంగా 19వ విడతని ఫిబ్రవరిలో నిధులు విడుదల చేస్తారని తెలుస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది