PM Modi | ప్రధాని మోదీ ఫిట్‌నెస్ రహస్యం.. మునగాకు పరాఠా లో ఉన్న ఆరోగ్య రహస్యాలు!
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఆయన ఆరోగ్యంపై, ఫిట్‌నెస్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఆయన ఎనర్జీ, చురుకుదనానికి కారణం ఏమిటంటే – ఆయన ఆహారపు అలవాట్లు. మోదీకి ఎన్నో ఆహారాలు ఇష్టమైనా, మునగాకు పరాఠా అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానమట!
“వారానికి రెండు, మూడు సార్లు మునగాకు పరాఠా తింటాను” అని మోదీ స్వయంగా చెప్పిన సందర్భం కూడా ఉంది.అయితే ఈ మునగలో ఏమి ప్రత్యేకత ఉంది? దీని ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
#image_title
మునగ – పోషకాలతో నిండిన ఔషధ గుణాలు ఉన్న ఆకు
ముఖ్యమైన పోషకాలు:
విటమిన్లు: A, B1, B2, C
ఖనిజాలు: కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్
యాంటీఆక్సిడెంట్లు
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు
మునగ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు
వాపు తగ్గింపు (ఎడెమా)
శరీర కణజాలాల్లో నీరు చేరి వాపు వచ్చినప్పుడు మునగ గింజల నూనె సహాయపడుతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కూడా ఉపశమింపజేస్తుంది.
కాలేయానికి రక్షణ
మునగకాయలు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తాయి. జంతువులపై చేసిన పరిశోధనల ప్రకారం, ఇది కాలేయ కణాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ కణాల నిరోధం
మునగ ఆకులు, బెరడు వంటి భాగాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకునే గుణాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని తేలింది.
గుండె ఆరోగ్యం
క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్జీమర్, డిప్రెషన్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణ
మునగ ఆకు సారం రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కొంత మేర సహాయపడుతుంది. అయితే దీని ప్రభావం పరిమితంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.