
Modi : ప్రధానితో చంద్రబాబు కీలక చర్చలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారుగా..!
Modi : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో సానుకూలంగా ఏవి పెద్దగా కనిపించలేదు. కేంద్రం నుండి ఏపీకి వచ్చిన ప్రయోజనాలు ఏంటనేవి కూడా అర్ధం కావడం లేదు. ఇదే సమయంలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం కోసం చంద్రబాబు నేరుగా ప్రధానికి పలు వినతులు అందించారు. పీఎం సైతం సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ లో విశాఖలో పర్యటన కోసం ప్రధానికి సీఎం ఆహ్వానించారు. విశాఖ కేంద్రంగా ఇద్దరు నేతలు కీలక అడుగుకు నిర్ణయించారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించానని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాజధాని నగరం అమరావతికి మద్దతు ఇస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీకి సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ముందుకు తీసుకెళుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. కొత్త రైల్వే జోన్ కు డిసెంబరులో పునాది రాయి పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనుల చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి తెలిపారని చంద్రబాబు వెల్లడించారు.
Modi : ప్రధానితో చంద్రబాబు కీలక చర్చలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారుగా..!
విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన కు ప్రధాని వస్తున్న సమయంలోనే మరో అంశం చర్చకు కారణం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. తాజాగా కాంట్రాక్టు కార్మికుల అంశంలో తాత్కాలిక ఒప్పందం జరిగింది. అయితే, ప్లాంట్ కు నిధుల కేటాయింపు పైన స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్ లో ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన ఈ లోగానే స్పష్టత ఇస్తారా..ప్రధాని సమయంలో ఇచ్చేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణాని కేంద్రం పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.