
CMEPG Loan
CMEPG Loan Eligibility: మహారాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (CMEGP) ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తొలి తర ఎంటర్‌ప్రెన్యూర్లకు, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు రూపకల్పన చేయడం, తయారీ రంగం నుంచి సేవా రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వరకు విస్తృతమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ రుణాలపై 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది.
CMEPG Loan
అర్హతల పరంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లు కాగా, SC/ST, OBC, మైనారిటీలు, మహిళలు, మాజీ సైనికులు మరియు శారీరక వికలాంగులకు వయస్సు పరిమితి 45 ఏళ్లు వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ విలువ ₹5 లక్షల కంటే ఎక్కువ అయితే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వేషన్ విధానంలో మహిళలకు 30%, SCలకు 15%, STలకు 7.5%, OBCలకు 27%, మైనారిటీలకు 5%, వికలాంగులకు 3% వరకు అవకాశాలు కేటాయించారు.
ఈ పథకం కింద తయారీ రంగంలో టెక్స్టైల్, హస్తకళలు, తోలు వస్తువులు, ఫర్నిచర్ వంటి యూనిట్లు; సేవా రంగంలో బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు, ఐటీ సేవలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, వ్యవసాయ ఆధారిత రంగంలో పాడి, కోళ్ల పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్, సేంద్రీయ వ్యవసాయం, అలాగే గ్రామీణ/కుటీర పరిశ్రమలులో ఖాదీ, చేనేత, వెదురు ఉత్పత్తులకు రుణాలు అందిస్తారు. అభ్యర్థులు CMEGP అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంచి, యువతను ఉద్యోగదాతలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.