CMEPG Loan : రూ.10 లక్షల లోన్ అందిస్తున్న CMEPG …దీనికి అర్హులు ఎవరంటే !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CMEPG Loan : రూ.10 లక్షల లోన్ అందిస్తున్న CMEPG …దీనికి అర్హులు ఎవరంటే !!

 Authored By sudheer | The Telugu News | Updated on :24 August 2025,6:00 pm

CMEPG Loan Eligibility: మహారాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (CMEGP) ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తొలి తర ఎంటర్‌ప్రెన్యూర్లకు, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు రూపకల్పన చేయడం, తయారీ రంగం నుంచి సేవా రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వరకు విస్తృతమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ రుణాలపై 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది.

CMEPG Loan

CMEPG Loan

అర్హతల పరంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లు కాగా, SC/ST, OBC, మైనారిటీలు, మహిళలు, మాజీ సైనికులు మరియు శారీరక వికలాంగులకు వయస్సు పరిమితి 45 ఏళ్లు వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ విలువ ₹5 లక్షల కంటే ఎక్కువ అయితే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వేషన్ విధానంలో మహిళలకు 30%, SCలకు 15%, STలకు 7.5%, OBCలకు 27%, మైనారిటీలకు 5%, వికలాంగులకు 3% వరకు అవకాశాలు కేటాయించారు.

ఈ పథకం కింద తయారీ రంగంలో టెక్స్టైల్‌, హస్తకళలు, తోలు వస్తువులు, ఫర్నిచర్ వంటి యూనిట్లు; సేవా రంగంలో బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు, ఐటీ సేవలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, వ్యవసాయ ఆధారిత రంగంలో పాడి, కోళ్ల పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్, సేంద్రీయ వ్యవసాయం, అలాగే గ్రామీణ/కుటీర పరిశ్రమలులో ఖాదీ, చేనేత, వెదురు ఉత్పత్తులకు రుణాలు అందిస్తారు. అభ్యర్థులు CMEGP అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంచి, యువతను ఉద్యోగదాతలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది