Pokiri Movie | పోకిరి లేడి విలన్ నెట్టింట ప్రకంపనలు పుట్టిస్తుందిగా.. ఏమందం ఇది..!
Pokiri Movie | సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా పోకిరి. 2006లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, అప్పటివరకు రొటీన్ కథలతో సాగిన మహేష్ కెరీర్‌కు భారీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కంటే ఎక్కువగా గుర్తింపు పొందిన ఒక ప్రత్యేకమైన పాత్ర గుర్తుందా? విలన్ గ్యాంగ్‌లో భాగంగా కనిపించిన మోనా అనే పాత్ర! “గిల్లితే గిల్లించుకోవాలి” అనే డైలాగ్‌తో ఆకట్టుకున్న ఆ పాత్రలో నటించినది షీవా రానా అనే నటి. ఆమె అసలు పేరు జ్యోతి రానా.

#image_title
జ్యోతి రానా ఎవరు?
ముంబయికి చెందిన ఈ మోడల్ పోకిరిలో కనిపించింది కేవలం కొన్ని సీన్లలోనే కానీ… అటిట్యూడ్, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆమె నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా, పోకిరి ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చింది.
జ్యోతి రానా నటనతో పాటు ఓ సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ కూడా. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా అందానికి తగ్గ పాత్రల్లో మెప్పించేది. ఆకాష్ పూరి నటించిన మోహబూబా చిత్రంలోనూ కనిపించిన జ్యోతి, ప్రస్తుతం హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు, యోగా వీడియోలు పంచుకుంటూ అభిమానులను కనెక్ట్ చేస్తోంది. పోకిరి రిలీజ్ అయ్యి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా… ఆమెకి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది.
View this post on Instagram