చట్ట సభల్లో ఎలా తిట్టుకోవాలి చెప్మా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

చట్ట సభల్లో ఎలా తిట్టుకోవాలి చెప్మా.!

చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు బూతు వీడియోలు కూడా చూస్తున్న సందర్భాలున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా రాజకీయ నాయకులు చట్ట సభల్లోనే తిట్టుకోవడం చూస్తున్నాం. మహిళామణులు కూడా, ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటూ బూతుల దండకాలు అందుకుంటున్న రోజులివి. మరి, చట్ట సభల్లో కొన్ని పదాల్ని నిషేధించడమో, లేదంటే కార్యకలాపాల సందర్భంగా వాడకూడదని పేర్కొనడమో ఎంతవరకు సబబు.? సభ్యత, సంస్కారం.. ఈ రెండిటినీ మర్చిపోతేనే ఇప్పుడు రాజకీయ నాయుకుడిగా గుర్తింపు పొందేందుకు అర్హత లభిస్తోంది. ఎవరు ఎంత […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 July 2022,6:00 am

చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు బూతు వీడియోలు కూడా చూస్తున్న సందర్భాలున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా రాజకీయ నాయకులు చట్ట సభల్లోనే తిట్టుకోవడం చూస్తున్నాం. మహిళామణులు కూడా, ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటూ బూతుల దండకాలు అందుకుంటున్న రోజులివి. మరి, చట్ట సభల్లో కొన్ని పదాల్ని నిషేధించడమో, లేదంటే కార్యకలాపాల సందర్భంగా వాడకూడదని పేర్కొనడమో ఎంతవరకు సబబు.? సభ్యత, సంస్కారం.. ఈ రెండిటినీ మర్చిపోతేనే ఇప్పుడు రాజకీయ నాయుకుడిగా గుర్తింపు పొందేందుకు అర్హత లభిస్తోంది.

ఎవరు ఎంత బాగా తిట్టగలిగితే, వాళ్ళే రాజకీయ నాయకులుగా చెలామణీ అవుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలు బాగా తిట్టగలిగేవారిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నాయి, పదవులు కట్టబెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు, కొన్ని పదాల విషయమై నిషేధాజ్ఞలు విధిస్తే ఎలా.? ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ‘అవినీతి పరుడు.. అసమర్థుడు’ లాంటి పదాలు కూడా ఉపయోగించకూడదట. అదెలా సాధ్యం.? మీరు ఏం చేసుకుంటారో చేస్కోండి.. నేను అవే మాటలు మాట్లాడతానంటూ ఓ ప్రజా ప్రతినిథి బాహాటంగానే పార్లమెంటు తీరు తెన్నులపై మండిపడ్డాడు. దాంతో, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు.

Positive Dictionary For People's Representatives

Positive Dictionary For People’s Representatives

ఇది ప్రతిసారీ జరిగే పద్ధతేననీ, ఏ పదాన్నీ నిషేధించలేదనీ, అయితే పద్ధతి ప్రకారం కొన్ని పదాల్ని తొలగించామని చెప్పారు. తొలగించడమేంటో, నిషేధించడమేంటో.! అసలు ప్రజా ప్రతినిథులకు సంస్కారం నేర్పడం అనేది కొత్తగా ఎప్పుడు మొదలయ్యింది.? అన్న చర్చ షురూ అయ్యిందిప్పుడు. సంస్కారం మర్చిపోతేనే రాజకీయ నాయకుడిగా తొలి అర్హత లభిస్తున్నప్పుడు, చట్ట సభల్లోకి అత్యంత జుగుప్సాకరమైన భాష మాట్లాడేవాళ్ళని పంపుతున్నప్పుడు, ఉచ్ఛ నీఛాలు మర్చిపోయేవారికి మరింత ఉన్నత పదవులు లభిస్తున్నప్పుడు.. ‘పార్లమెంటరీ భాష’ అన్న మాటకి అర్థం పర్థం వుందా.?

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది