Post Office Scheme : పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ ఇదే.. ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎంతో తెలుసా..?
Post Office Scheme : ఇండియన్ పోస్టాఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేసుకుంటారు. పోస్టాఫీస్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదని నమ్ముతారు. అయితే పోస్టాఫీస్‌లో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడికి ఎలాంటి రిస్క్ పోస్టాఫీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి పూర్తిగా నమ్మకం ఉంచవచ్చు. అందుకే దేశంలోని కోట్లాది ప్రజలు పోస్టాఫీసు స్కీమ్ లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇలా ఎన్నో పెట్టుబడి స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడితో మంచి రాబడిని పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి మంచి ఆప్షన్.
ఈ స్కీమ్‌లో చిన్న పెట్టుబడిపై సుమారు రూ. 35 లక్షల ఫండ్ క్రియేట్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్ ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియా పోస్ట్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన స్కీమ్‌ను అమలు చేస్తోంది. అయితే ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి 80 సంవత్సరాల వయసు వచ్చాక.. అంటే ఫాలసీ మెచ్యూరిటీ సమయంలో బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందజేస్తుంది.
Post Office Scheme : రిస్క్ లేకుండా.. సేఫ్ గా
కాగా ఈ స్కీమ్ లో19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులు. అయితే ఈ స్కీమ్ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్ మొత్తానికిగాను పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. కాగా ప్రీమియాన్నినెల వారీగా, మూడు నెలలు, ఆరు నెలల వారీగా, ఏడాదికోసారి ఇలా చెల్లించే ఫెసిలిటి కల్పించింది. అలాగే ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. కాగా 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల పాలసీ తీసుకుంటే, 55 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం రూ,1,515 చెల్లిస్తే మెచ్యూరిటీ టైమ్‌లో రూ.31.6 లక్షలు పొందవచ్చు. అలాగే 58 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం రూ.1,463 చెల్లిస్తే రూ.33.4 లక్షలు అందుకోవచ్చు. ఇక 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం రూ.1,411 చెల్లిస్తే రూ.34.6 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.