Post Office Schemes : ప్రతి రోజు కేవలం రూ. 50 పొదుపుతో 35 లక్షల పొందే అవకాశం..!
ప్రధానాంశాలు:
Post Office Schemes : ప్రతి రోజు కేవలం రూ. 50 పొదుపుతో 35 లక్షల పొందే అవకాశం..!
Post Office Schemes : పేద, మధ్యతరగతి ప్రజలకి పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో తక్కువ నుంచి ఎక్కువ మొత్తం వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. నిజానికి కొన్ని పెట్టుబడులలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది.కానీ ఇందులో అందరూ పెట్టుబడి పెట్టలేరు. కానీ పోస్ట్ ఆఫీస్ లో అందరూ పెట్టుబడి పెట్టొచ్చు. అలాంటి ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకం చాలా ఉత్తమమైన అని చెప్పొచ్చు. ఇండియా పోస్ట్ నుంచి ఈ ప్రొటెక్షన్ ప్లాన్ లో తక్కువ రిస్క్ తో మంచి రాబడి వస్తుంది. ఈ పథకంలో ప్రతినెల 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి.
ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం వల్ల రాబోయే కాలంలో 31 నుంచి 35 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందుతారు. 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం కింద కనీస హామీ మొత్తం పదివేల రూపాయలు వచ్చి పది లక్షలు వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రీమియం చెల్లింపు నెలవారి, త్రైమాసికమ్, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా చేసుకోవచ్చు. మీరు ఈ పథకంపై రుణాన్ని కూడా తీసుకోవచ్చు ఈ పథకాన్ని తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత చేయొచ్చు.
కానీ ఈ పరిస్థితుల్లో ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అంటే. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టి పది లక్షల రూపాయల పాలసీని కొనుగోలు చేశాడు అనుకుందాం..అప్పుడు అతని నెలవారి ప్రీమియం 55 సంవత్సరాలకు 1515 రూపాయలు. 58 సంవత్సరాలకు 1463 రూపాయలు.. 60 సంవత్సరాలకు 1411 రూపాయలు అవుతుంది. ఈ పరిస్థితిలో పాలసీ కొనుగోలుదారు 55 సంవత్సరాలకు 31.6 లక్షలు.. 58 సంవత్సరాలకు 33.4 సున్నా లక్షలు 60 సంవత్సరాలకు 34.6 మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందవచ్చు…