Prank Gone Wrong : షాపులోకి వెళ్లి ప్రాంక్ వీడియో చేయబోయిన యూట్యూబ్ యాంకర్.. చితకబాదిన షాపు యజమాని
Prank Gone Wrong : ప్రాంక్ వీడియోలు తెలుసు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రాంక్ వీడియోలే కనిపిస్తాయి. ఎవరైనా సడెన్ గా మీదగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడమో.. డబ్బులు అడగడమో చేస్తూ.. మీతో టైమ్ పాస్ చేయడం.. అమ్మాయిలు అయితే.. వాళ్ల దగ్గరికి వెళ్లి ఐలవ్యూ చెప్పడం.. వాళ్లను టచ్ చేయడం.. కిస్ చేయడం.. ఇలా రకరకాలుగా ఉంటాయి ప్రాంక్ వీడియోలు. ఆ మధ్య పానీ పూరీ సెంటర్ వద్ద.. ఓ యువతి పానీ పూరీ తింటుండగా.. ఓ యువకుడు వెళ్లి తన పానీపూరీ తినేస్తాడు. ఆ యువతి తన పానీపూరీలను వేరే వ్యక్తి తినడం చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత అది ప్రాంక్ వీడియో అని తెలిసి.. తనలో తానే నవ్వుకుంటుంది. ఇలా.. ప్రాంక్ వీడియోలు చాలానే చేస్తుంటారు.

prank video gone wrong in hyderabad jagadish market
అయితే.. కొన్ని సార్లు ప్రాంక్ వీడియోలు కాస్త అదుపు తప్పుతాయి. ఎవరి మీద అయితే ప్రాంక్ వీడియోలు చేస్తుంటారో వాళ్లకు కోపం వస్తే.. ఇక అంతే. అది ప్రాంక్ అని తెలిసినా కూడా ప్రాంక్ చేసినోడిని చితకబాదుతారు. అలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా మనం ఎన్నో చూశాం. తాజాగా హైదరాబాద్ లోనూ అటువంటి ప్రాంకే ఒకటి జరిగింది. అయితే.. ఆ ప్రాంక్ సీరియస్ అయిపోయి చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
Prank Gone Wrong : ప్రాంక్ అని తెలిసినా కూడా యాంకర్ ను చితకబాదాడు
అబిడ్స్ లోని జగదీశ్ మార్కెట్ లో యూట్యూబ్ చానెల్ కు చెందిన యాంకర్.. అక్కడే ఉన్న ఓ మొబైల్ షాపునకు వెళ్లి ప్రాంక్ చేద్దామనుకున్నాడు. ఓ మొబైల్ షాపునకు వెళ్లి.. అక్కడ షాప్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదయింది. దీంతో ఆ షాపు ఓనర్ కు కోపం వచ్చింది. ఆ యువకుడిని తిట్టడం, కొట్టడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత.. ఇదేదో పెద్దగా అవుతుంది అని గ్రహించిన ఆ యాంకర్.. సార్ సార్.. సారీ సార్.. ఇది ప్రాంక్ వీడియో.. అంటూ షాపు యజమానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ షాపు యజమాని మాత్రం అస్సలు వినలేదు. అలాగే కొడుతూ ఉన్నాడు. దీంతో అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. యాంకర్ తో పాటు.. షాపు యజమానిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.