Pre Wedding Shoot | ఇదేం పిచ్చిరా నాయనా.. గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్
Pre Wedding Shoot | ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు పీక్స్ చేరుకున్నాయి. జంటలు పెళ్లికి ముందే తమ ప్రేమకథను ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో రొమాంటిక్, క్రియేటివ్, అడ్వెంచరస్ కాన్సెప్ట్స్‌తో షూట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రీ-వెడ్డింగ్ వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
#image_title
పిచ్చి పీక్స్ లో..
ఆ వీడియోలో వధూవరులు గాల్లో వేలాడుతూ పోజులు ఇస్తున్నారు. ఇద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, వాటికి రంగురంగుల బెలూన్ల గుత్తిని కట్టుకున్నారు. మొదట చూస్తే బెలూన్ల సాయంతో గాల్లో తేలుతున్నట్లే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి, వారు ఒక పెద్ద క్రేన్‌కు వేలాడదీయబడ్డారు.
వీడియోలో వారు నవ్వుతూ, ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కెమెరా ముందు పోజులు ఇస్తూ కనిపిస్తారు. నేల నుంచి చాలా ఎత్తులో ఉన్న ఈ షూట్, చూసేవారిలో భయంతో పాటు “వావ్!” అనిపించే భావనను కలిగిస్తోంది.చివర్లో కెమెరా క్రిందికి తిరిగి, ఆ జంటను గాల్లో పట్టుకున్న భారీ క్రేన్‌ను చూపిస్తుంది. “సంవత్సరంలో అత్యంత ప్రత్యేకమైన ప్రీ-వెడ్డింగ్ షూట్” అనే టెక్స్ట్ తెరపై కనిపిస్తుంది.ఈ వీడియోను సెప్టెంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @gagan_buttar_46 షేర్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యం, ఆందోళన, సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు.
View this post on Instagram