YS Jagan : సీఎం జగన్ మీద కోపంతో నిర్మాత సంచలన నిర్ణయం..!
YS Jagan : ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా. కరోనా వల్ల జనజీవనమే అస్తవ్యస్తమైంది. గత సంవత్సరం లాక్ డౌన్ విదించడంతో ప్రపంచమే అతలాకుతలమయింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తే మాత్రం మరోసారి మానవాళి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమ పడుతున్న టెన్షన్ అయితే మామూలుగా లేదు. మొన్నమొన్ననే థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ అవుతూ.. థియేటర్లు కళకళలాడుతున్న నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో టాలీవుడ్ ఉంది.
మళ్లీ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మళ్లీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. పలు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నా సినిమా రిలీజ్ లను మూవీ యూనిట్లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని సినిమాలు రన్ అవుతున్నా.. కలెక్షన్లు నిల్. ఏ సినిమా కూడా ఆడటం లేదు. అసలు… ప్రేక్షకులు థియేటర్ వైపే చూడటం లేదు. పెద్ద పెద్ద సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా… జనాలు మాత్రం కనిపించడం లేదు. వకీల్ సాబ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
YS Jagan : అసలుకే ఎసరు పెట్టిన ఏపీ ప్రభుత్వం కొత్త జీవో
అసలే ఓవైపు కరోనాతో సినిమా ఇండస్ట్రీ అల్లాడిపోతుంటే… జగన్ సర్కారు కొత్త జీవో తెచ్చింది. ఈ కొత్త జీవో వల్ల… సినిమా టికెట్ల రేట్లు అమాంతం పడిపోయాయి. పాత టికెట్ల ధరలనే అమలు చేసేలా కొత్త జీవో రావడంతో ఇక… థియేటర్లను మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని కొందరు థియేటర్ల యజమానులు అంటున్నారు. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు కూడా అదే చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే… తనకు ఏపీలో ఉన్న సుమారు ఓ ముప్పై నలబై థియేటర్లను సురేశ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ మూసేసినట్టు తెలుస్తోంది. అలాగే వైజాగ్ లో ఉన్న జ్యోతి థియేటర్ ను కూడా క్లోజ్ చేశారు. మరోవైపు కాకినాడలో ఉన్న థియేటర్లను కూడా మూసేసినట్టు తెలుస్తోంది. సురేశ్ బాబుకు చెందిన థియేటర్లన్నీ మూతపడినట్టు తెలుస్తోంది. ఏపీలో పరిస్థితి ఇలా ఉంది కానీ… తెలంగాణలో అయితే ప్రస్తుతానికి టికెట్ల ధరల విషయంలో ఎటువంటి మార్పు లేదు. కానీ కరోనా కారణంగా థియేటర్లను కూడా మూసేసే పరిస్థితి తెలంగాణలోనూ వచ్చే అవకాశం ఉంది.