Radhe shyam Pre Teaser : రాధేశ్యామ్ ప్రీ టీజర్ అద్భుతం.. ప్రభాస్ లోని కొత్త యాంగిల్ చూపించిన దర్శకుడు ..!

Authored By vamana sai | The Telugu News | Published on: February 6, 2021, 1:02 pm

Radhe shyam Pre Teaser : రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ కోసం రెడీ గా ఉండండి అంటూ మేకర్స్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రాధేశ్యామ్ నుంచి దేశం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ ఈ నెల 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ టీజర్ చూస్తుంటే ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో ఏ సినిమాలో చూపించని విధంగా దర్శకుడు రాధాకృష్ణ చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక మేకర్స్ తాజాగా ‘గెట్ రెడీ ఫర్ ది బిగ్గెస్ట్ లవ్ అనౌన్స్‌మెంట్’ అంటూ ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ అద్భుతంగా ఉందంటూ అప్పుడే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి మొదలు పెట్టారు.

radhe shyam movie pre teaser

radhe shyam movie pre teaser

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధేశ్యామ్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ యూరప్ కి చెందిన వింటేజ్ కార్ల వ్యాపారిగా.. రిచ్ బిజినెస్ మేన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక పూజా హెగ్డే ఒక సాధారణ యువతిగా కనిపిస్తుందని తెలుస్తోంది. అంటే ధనిక – పేద ల మధ్య అందమైన ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ లో ఇదే విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు రాధకృష్ణ.

Radhe shyam Pre Teaser : త్వరలో రిలీజ్ అయ్యే టీజర్ లో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్..?

ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ .. కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. రాధేశ్యామ్ మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కాగా త్వరలో రిలీజ్ అయ్యే టీజర్ లో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసందే. అలాగే ఆదిపురుష్ కూడా రీసెంట్ గా షూటింగ్ మొదలైంది.

vamana sai

No bio available for this author.

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp