Salaar : సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ టాప్ సీక్రెట్ ఎలా బయటపడింది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salaar : సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ టాప్ సీక్రెట్ ఎలా బయటపడింది..?

 Authored By govind | The Telugu News | Updated on :5 February 2021,7:00 am

Salaar : సలార్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్నలేటెస్ట్ సినిమా. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరి చూపు దీనిపైనే పడింది. ది బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియన్ సినిమా గా వస్తోన్నఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక మూవీ కి సంబంధించి ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి సాలార్ పై భారీ అంచనాలు పెరిగాయి. మూవీ కి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేష కూడా హాట్ టాపిక్ గా మారింది.

salaar prabhas is in dual role top sceret revealed

salaar-prabhas-is-in-dual-role-top-sceret-revealed

ఇక లేటెస్ట్ గా సలార్ ఆన్ లొకేషన్ లోని పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు బయటకు రావడం తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ లుక్స్ డిఫరెంట్ గా ఉండటంతో సలార్ లో ప్రభాస్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా
మారింది. టైటిల్ ను ప్రకటించిన సమయంలో విడుదల చేసిన పిక్ కి ఇప్పటి ప్రభాస్ లుక్ కి అసలు సంబంధమే లేదు. రెండు లుక్స్ చూస్తే చాలా వేరియేషన్ ఉందని తెలుస్తోంది. దీనితో డార్లింగ్ సలార్ లో డ్యుయల్ రోల్ లో ఫ్యాన్స్ ను అలరించనున్నాడన్న వార్త ఇండస్ట్రీ లో తెగ వైరల్ అవుతోంది.

Salaar : సలార్ లో ప్రభాస్ ది డ్యుయల్ రోల్ ఆ కాదా అన్నది చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది..!

సలార్ లో ప్రభాస్ డ్యుయల్ రోల్ టాప్ సీక్రెట్ ఎలా బయటపడింది అని అందరు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను సలార్ లో సరికొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. కేజీఎఫ్ హిట్ తో జాతీయ స్థాయిలో తన సత్తాను చూపించిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు సలార్ తో తన క్రేజ్ ను పెంచుకోవాలని కసిగా ఉన్నాడు. అందులోనూ ప్రభాస్ కావడంతో అంచనాలు మించిపోయాయి. ఇదే సమయంలో షూటింగ్ స్పాట్ లో ఉన్న ప్రభాస్ పిక్స్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుండటం తో ఒక్కొక్కరు ఒక్కో కథను అల్లేస్తున్నారు. అయితే సలార్ లో ప్రభాస్ ది డ్యుయల్ రోల్ ఆ కాదా అన్నది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది