raghu rama krishnam raju case to supreme court
raghu rama krishnam raju తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తించిన రఘురామ కృష్ణంరాజు raghu rama krishnam raju కేసు సుప్రీం కోర్టుకు చేరింది. హైదరాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైధ్య పరీక్షలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల అనుసారంగానే సుప్రీం కోర్టుకు ఆర్మీ ఆసుపత్రి నుండి రిపోర్ట్ లు వెళ్లాయి. ఆ రిపోర్ట్ లను అందుకున్న సుప్రీం కోర్టు రఘురామ మరియు ప్రభుత్వం తరపున వాదనలు వింటుంది. ఈ కేసు మొత్తం కూడా కక్ష పూరితంగా పెట్టారంటూ రఘురామ తరపు న్యాయవాది వాదించాడట. కోర్టు లో రఘురామ తరపు న్యాయవాది కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆరోపించాడు. ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ ఆరోపించాడు.
రఘురామ కృష్ణం రాజు పై కేసు నమోదు చేసింది సీఐడీ. సాదారణంగా అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప సీఐడీ రంగంలోకి దిగదు. కాని ఈ కేసులో మాత్రం వారే ముందుకు వచ్చి కేసు నమోదు చేసి ఎంక్వౌరీ మొదలు పెట్టారు. పోలీసులు ఉండగా నేరుగా ఈ కేసు సీఐడీ వరకు ఎందుకు వెళ్లింది అంటూ రఘురామ లాయర్ ప్రశ్నించారట. ఆ సమయంలో ప్రభుత్వం తరపు లాయర్ ప్రభుత్వ రంగ ఎంక్వౌరీ సంస్థలు ఎవరైనా వచ్చి ఫిర్యాదు ఇచ్చే వరకు వెయిట్ చేయాలా అంటూ ప్రశ్నించాడట. సీఐడీ కేసు పెట్టిన కేసు లో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదు.. దీనికి అసలు ప్రభుత్వంకు సంబంధం లేదు అన్నట్లుగా సీఐడీ తరపున లాయర్ వాదించారు.
raghu rama krishnam raju case to supreme court
సుప్రీం కోర్టులో వాదనల సందర్బంగా సీఐడీ తరపు లాయర్ వాదిస్తూ.. రఘురామ కేసును బలహీన పర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాడు. గుంటూరు నుండి హైదరాబాద్ కు ఆంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నించగా ఆయన కేవలం తన వాహనంలో మాత్రమే వస్తానంటూ పట్టుబట్టాడు. ఆయన్ను మరో దారి లేక ఆయన వాహనంలోనే తరలించాల్సి వచ్చింది. కారు ఎక్కిన సమయంలో కాలు ఎత్తి చూపించిన రఘురామ ఆ తర్వాత మాత్రం నడవలేను అంటూ డ్రామాలు ఆడాడు. అంటే దీన్ని బట్టి ఆయన సింపతీ కోరుకుంటున్నాడు అంటూ అర్థం అయ్యిందని.. ఈ కేసు మొత్తంలో రఘురామ అతి గా ప్రవర్థిస్తున్నాడంటూ లాయర్ పేర్కొన్నాడు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.