Revanth Reddy : సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ పదవి నియామకంపై స్పీడ్ పెంచిన హైకమాండ్
Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో వినిపిస్తున్న ఒకే ఒక పేరు రేవంత్ రెడ్డి. అది నిజంగా పేరు కాదు.. ఒక బ్రాండ్. తెలంగాణ ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి అని టక్కున అందరూ చెప్పేస్తారు. అది రేవంత్ రెడ్డికి ఉన్న పాపులారిటీ. ఆయన పార్టీ మనిషి కాదు.. ప్రజల మనిషి అని అందరూ అంటుంటారు. సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతారు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆయన అభిమానులు ఇప్పటి నుంచే ప్రచారాలూ మొదలుపెట్టారు.
ఏది ఏమైనా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకనే పార్టీకి పునర్వైభవం వచ్చింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం దమ్మున్న నాయకుల కొరత చాలా ఉంది. అందరూ సీనియర్ నాయకులు అయిపోయారు. పార్టీకి యువ రక్తం కావాలి. యువతను మేల్కొలపాలి అంటే అది కేవలం రేవంత్ రెడ్డి వల్లనే. అందుకే… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేత అయిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్ గిరి ఎంపీగానూ ఉన్నారు.
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. పార్టీ తరుపున ముందుండి నడిపించే నేత రేవంత్ రెడ్డి. అందుకే పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికే ఇస్తే బాగుంటుందని చాలామంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా… వేరే పార్టీ నుంచి వచ్చిన నేతకు పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారంటూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హైకమాండ్ వద్ద మోకాలు అడ్డేస్తున్నారట. అందుకే.. పీసీసీ చీఫ్ పదవి నియామకం లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది.
Revanth Reddy : పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి కన్ఫమ్? ఆ కీలక నేత రేవంత్ రెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట?
నిజానికి టీపీసీసీ చీఫ్ పదవి నియామకం ఎప్పుడో జరిగేది కానీ.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత టీపీసీసీ చీఫ్ ను నియమించాలంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి హైకమాండ్ ను కోరడంతో… సాగర్ ఉపఎన్నిక ముగిసేవరకు పీసీసీ చీఫ్ నియామకాన్ని హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నక ముగియడంతో… మళ్లీ పీసీసీ చీఫ్ పదవి నియామకంపై హైకమాండ్ దృష్టి సారించింది.
పీసీసీ చీఫ్ పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడినా… హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోందట. చివరకు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తెలంగాణ నుంచి సీనియర్ నేత జానారెడ్డి కూడా రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది అని హైకమాండ్ కు స్పష్టం చేశారట. అయితే.. కొందరు నేతల నుంచి రేవంత్ రెడ్డి విషయంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అందరినీ ఒప్పించి మరీ… రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారట. త్వరలోనే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. అది ఎంతవరకు నిజమో? ఎంతవరకు అబద్ధమో?