Rainbow Snake : రెయిన్ బో స్నేక్ ను ఎప్పుడైనా చూశారా? చూస్తే నోరెళ్లబెడతారు?
Rainbow Snake : పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే.. ఈ ప్రపంచంలో వంద రకాల పాములు ఉన్నా.. అందులో విషపూరితమైనవి.. రెండు మూడు రకాలు మాత్రమే ఉంటాయి. మిగితా వన్నీ విషపూరితమైన పాములు కాదు. కొన్ని పాములు రంగు రంగులుగా ఉంటాయి. కొన్ని పాములు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని పాములు వర్ణ రంగులో ఉంటాయి. ఏది ఏమైనా.. చాలా పాములు చాలా రంగుల్లో ఉండి మెరిసిపోతుంటాయి. అయితే.. మీరు అన్ని కలర్లు ఉన్న పామును ఎప్పుడైనా చూశారా? దాన్నే రెయిన్ బో అంటాం కదా. రెయిన్ బో ఆకాశంలో కనిపిస్తే ఎలా ఆకాశం రంగులుగా మారుతుందో తెలుసు కదా. అలాగే.. రెయిన్ బో కలర్లు ఉన్న పామును చూస్తే మీరు కూడా వావ్ అంటారు.
ఇంద్రదనస్సులో ఉండే రంగులన్నీ ఆ పాములోనే కనిపిస్తాయి. ఆ పామును మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇక జన్మలో కూడా చూడరు. ఎందుకంటే.. అది చాలా స్పెషల్ పాము. ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. అరుదైన పాము. దానికి రెయిన్ బో స్నేక్ అనే పేరు. ఆ పాముకు ఉండే రంగుల వల్ల ఆ పామును చూస్తే తెగ ముద్దొచ్చేస్తుంది. అలాగని.. ఆ పామును చూసి ముద్దు పెట్టుకునేరు.
Rainbow Snake : కాలిఫోర్నియాలో కనిపించిన రెయిన్ బో స్నేక్
ఈ పాము.. యూఎస్ లోని కాలిఫోర్నియాలో కనిపించింది. ఈ పాము స్పెషాలిటీ ఏంటంటే.. ఎండ ఉన్నప్పుడు.. సూర్యుడి ఎండ దాని మీద పడినప్పుడే.. దానిలోని రంగులన్నీ కనిపిస్తాయి. దాని శరీరం రంగురంగులతో మెరిసిపోతుంది. కొండ చిలువ జాతికి చెందిన పాము అది. కాకపోతే.. ఈ పాము అంత విషపూరితైమనది కాదట. దీన్ని పట్టుకున్న జయ్ అనే వ్యక్తి ఈ పాము వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో ఈ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.