RRR : ఆర్‌ఆర్ఆర్‌ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న అభిమానుల హంగామా

Advertisement

RRR : తెలుగు ప్రేక్షకుల మాత్రమే కాకుండా యావత్ భారత సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్‌. ఈ సినిమాకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీం పాత్రలో కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు పోస్టర్స్ లు సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. దాదాపుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు మించిన బిజినెస్ ను చేసింది అనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో కూడా చాలా అగ్రెసివ్‌ గా దర్శకుడు వ్యవహరిస్తున్నాడు. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు ఒక విషయం ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన వీరిద్దరు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. కనుక అభిమానుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో చేస్తున్నహడావుడి తో రామ్ చరణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా అదే రేంజ్ హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి హడావుడి ఉంటే సినిమా విడుదలైన సమయంలో ముఖ్యంగా థియేటర్ల వద్ద ఎలాంటి హడావుడి ఉంటుంది.

Advertisement
rajamouli and team tension about ntr and ram charan fans
rajamouli and team tension about ntr and ram charan fans

ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి అనే ఆందోళన రాజమౌళి మరియు ఆయన టీం మెంబెర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరో లు కూడా తమ తమ అభిమానులు జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇద్దరు హీరోలకు తగు ప్రాముఖ్యత ఇచ్చినప్పటికి ఒక హీరో కు కాస్త ఎక్కువ అన్నట్లుగా విమర్శలు మొదలయ్యాయి. సినిమా విడుదలైన తర్వాత ఆ విమర్శలు పీక్స్ కు చేరుతాయి అనిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి చర్చ లు వస్తాయి అనేది చూడాలి. మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా విడుదలయ్యే వరకు కాస్త టెన్షన్ పడాల్సిందే.

Advertisement
Advertisement